సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట.

కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఈ నెల  25వ తేదీన  వెకేషన్  బెంచ్  వెళ్లాలని  సుప్రీంకోర్టు  మంగళవారం నాడు  సూచించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నిన్న  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మంగళవారంనాడు విచారించింది.అయితే  ఈ నెల  25వ తేదీన విచారణ జరపాలని  తెలంగాణ హైకోర్టును ఆదేశించింది  సుప్రీంకోర్టు. జస్టిస్ జేకే మహేశ్వరి, జ.స్టిస్ నరసింహంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం  ఇవాళ  ఈ విషయమై ఆదేశాలు ఇచ్చింది.

అదే సమయంలో అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకముందు అవినాష్ రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు ఇప్పటికే ఏడు సార్లు హాజరైన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఎంపీ విచారణకు సహకరించారని. ఈ కేసులో ఆయన నిందితుడిని కాదన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యారని. మరో ప్రక్క  ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే ఎస్ సునీతా రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లదలచుకోలేదని. ఏదైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై సమగ్ర వాదనలు విన్న తర్వాతే హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపనుంది.

అయితే ఏప్రిల్  24 తర్వాత  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఎన్ని దఫాలు  సీబీఐ విచారణకు  వెళ్లారని  సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.  ఇప్పటివరకు  మూడు దఫాలు  సీబీఐ నోటీసులు  జారీ చేసినా కూడా   వైఎస్ అవినాష్ రెడ్డి  విచారణకు  హాజరు కాలేదని  వైఎస్ సునతా రెడ్డి  తరపు న్యాయవాది  వాదనలు విన్పించారు. నిన్న  కర్నూల్ ల  చోటు  చేసుకున్న పరిణామాలను  కూడా  సునీతా రెడ్డి తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుంచారు.

Leave a Reply