Perni Nani vs Harish Rao: కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దంగా వున్నా హరీష్ ర
Perni Nani: విశాఖ స్టీల్ ప్లాంట్ లో బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఏపీ వ్యవహారాలపై తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయటం వాటికి ఏపీ మంత్రుల కౌంటర్లతో రాజకీయం వేడెక్కింది.
బిడ్ కోసం తెలంగాణ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో సమావేశమయ్యారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.
వీటిపై అర్ ఐ ఎన్ ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీని పైన మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని చెప్పుకొచ్చారు. తాము తెగించి కొట్లడాము కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఏపీ మంత్రులపై, వైసీపీ నేతలపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై పేర్నినాని స్పందించారు. హరీష్ రావుది పదునైన బుర్ర అని చెప్పారు. హరీష్ రావు తెలివైన రాజకీయ నాయకుడని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలతో హరీష్ రావు వైసీపీపై విమర్శలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ ను తిట్టలేక జగన్ సర్కార్ పై , వైసీపీపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు.
అయితే మామపై ఎప్పుడు కడుపు రగిలినా హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై వైసీపీపై విమర్శలు చేస్తున్నాడన్నారు. తనను కేసీఆర్ పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు కోపం ఉందన్నారు. కేటీఆర్ , కవితలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడంపై హరీష్ రావుకు కడుపుమంటగా ఉందన్నారు. మామ అల్లుళ్ల మధ్య తగాదాలే హరీష్ రావు విమర్శలకు కారణంగా ఆయన పేర్కొన్నారుు. ఏపీపై ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు పేర్నినాని.,
తెలంగాణ రాష్ట్రంలో మాక్కూడా ఫ్రెండ్స్ ఉన్నారని.. హైదరాబాద్, సిద్ధిపేటలో రోడ్లు బాగుంటే చాలా? అని పేర్ని నాని ప్రశ్నించారు. హరీష్ రావుకు కేసీఆర్‌పై కడుపు రగిలినప్పుడల్లా ఆంధ్రా వాళ్లు అంటూ తమను కెలుకుతుంటారని.. తమ చేత కేసీఆర్‌ను తిట్టిస్తారని వ్యాఖ్యానించారు.
ఆంధ్ర ప్రజలపై వారికి నిజంగానే ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో హరీష్ రావు చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అనాలా? టీఆర్ఎస్ అనాలా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బ్యాక్ టు పెవిలియన్‌కు వెళ్లిపోయిందా అని ప్రశ్నించారు.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఏపీలో పాలకులు ప్రజలను గాలికొదిలేసి సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని హరీస్ ఆరోపించారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు ఆంధ్రాను ఆగం చేశాయని మండిపడ్డారు. ఏపీ మంత్రులు అనవసరంగా తమ జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. అలాగే, ఆంధ్రాలో ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వాళ్లంతా ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో, హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు కౌంటర్ మిద కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు.