సీయంతో పాటు మీడియా అత్యుత్సాహం…

cm media overaction

విషయమేదైనా, ఎలాంటిదైనా సెన్సేషన్ చేసి వీక్షకులను ఆకట్టుకునే తత్వం నేటి మీడియాది. అలా చేసిన సెన్సేషన్ పర్యవసానం గురించి మాత్రం మీడియా ఇసుమంతైనా ఆలోచించదు. వివరాల్లోకి వెళితే ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు లో వేసిన మూడు రాజధానుల కేసు విచారణ జరుగుతోంది.  ఈ లోపల ఈ అంశం పై రెండు రోజుల్లో రెండు సార్లు అటు సీయం ఇటు మీడియా ఛానల్ అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. జనవరి 31న ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సీయం తమ రాజధాని మారబోతోందని, అందరూ కొత్త రాజధానికి రావాలని బాహటంగానే ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 1న tv9లో ఏకంగా విశాఖకు రాజధానిగా లైన్ క్లియర్,  కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది అని బిగ్గర అక్షరాలతో బిగ్ బ్రేకింగ్ గా ప్రసారం చేశారు. ఓ పక్క కోర్టులో కేసు నడుస్తున్నపుడు ఉన్నత పదవిలో వున్న నేత అలానే ప్రముఖ మీడియా, ఇటువంటి అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు ప్రజలకు చేరవేస్తే వారి భావావేశాల పరిస్థితి ఏమిటి .. ఏది ఏమైనప్పటికీ సరైన సమయానికి ఉత్సాహం అవసరమే … అలానే అనవసర సమయంలో అత్యుత్సాహం కూడా అనర్ధమే.  ఈ విషయాన్ని అటు ముఖ్యమంత్రి, ఇటు మీడియా గమనించుకుంటే మంచిది.

Leave a Reply