NC 22 Title – Custody: ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా, NC 22, పేరు “కస్టడీ”. చైతన్య పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ NC 22 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది, ఇది టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం NC 22కి ‘కస్టడీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బుధవారం నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ NC 22 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా ఓ సినిమాలో నటించబోతున్నాడు. మరి అది కానిస్టేబుల్ పాత్రలోనా, ఇంకా పెద్ద ఆఫీసర్ పాత్రలోనా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కిస్తోన్ ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. బంగార్రాజు త‌ర్వాత నాగ చైత‌న్య‌తో కృతి శెట్టి మ‌రోసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraja), యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కదిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నాగ చైతన్య తొలిసారి నటిస్తోన్న ద్వి భాషా చిత్రం కస్టడీ (Custody Movie). అది కూడా కోలీవుడ్ డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వెంకట్ ప్రభు (Venkat Prabhu) అనువాద చిత్రాలకు తెలుగులో మంచి గుర్తింపే దక్కింది. ఆయన తొలిసారిగా తెలుగులో తెరకెక్కిస్తోన్న చిత్రమిది. అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో నటించలేదు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో కాసేపు పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ఆయన కనిపించారు. కానీ తొలిసారి కస్టడీ సినిమాలో పూర్తి స్థాయిలో పోలీస్‌గా మెప్పించనున్నారు అక్కినేని హీరో. మరి కస్టడీ సినిమాలో పోలీస్ వ్యవస్థను ప్రశ్నించేలా ఉంటుందా? లేక రివేంజ్ డ్రామాలాగా ఉంటుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh