Manchu Manoj: వివాహబంధంతో ఒక్కటైన మనోజ్ మౌనిక రెడ్డి

manchu manoj bhuma mounika reddi married

Manchu Manoj: వివాహబంధంతో ఒక్కటైన మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి

Manchu Manoj: ప్రముఖ నటుడు మోహన బాబు తనయుడు  మంచు మనోజ్‌ పెళ్లి పీటలు ఎక్కారు. భూమా కుటుంబ వారసురాలిని పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

అయితే ఆయనకు ఇది  రెండో వివాహం. 2016లో ప్రణతిని పెళ్లి చేేసుకున్నారు. అది విడాకులకు దారి తీసింది. 2019లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మౌనిక రెడ్డితో కొత్త జీవితాన్ని పంచుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని త్వరలో పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ ఇదివరకు వార్తలను ఇప్పుడు నిజం చేశారాయన.

మౌనిక రెడ్డితో మంచు మనోజ్ కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇదివరకు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

గత ఏడాది మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి కలిసి సికింద్రాబాద్ సీతాఫల్‌ మండిలోని వినాయకుడి ఆలయానికి వెళ్లారు.
అప్పుడే వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం బయటి కొచ్చింది.

డిసెంబర్ లో మరోసారి  కడపలోని అమీన్ పీర్ దర్గాను కూడా మనోజ్ సందర్శించారు. అక్కడా తన కొత్త జీవితం గురించి బయటపెట్టారు.

కొద్దిసేపటి కిందటే మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి వివాహబంధంతో ఏకం అయ్యారు.

వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. మంచు- భూమా కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.

ఈ వివాహ మహోత్సవానికి- మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మీ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

నూతన వధూవరులను ఆశీర్వదించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె మౌనిక రెడ్డి.

గతంలో భూమా నాగిరెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ కూడా చేశారు మంచు మనోజ్. నాగిరెడ్డిని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు.

ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తిగా కీర్తించారు మంచు మనోజ్.

ఆయన అశీస్సులు ఎప్పుడు మనపైనే ఉంటాయంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు ఆయన నటించిన చివరి మూవీ.

ఆ తరువాత ‘అహం బ్రహ్మాస్మి` అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అది పట్టాలెక్కనట్టే కనిపిస్తోంది.

ప్రస్తుతం `వాట్ ద ఫిష్` అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇది కూడ చదవండి :

Leave a Reply