TSLPRB: నేడు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

TSLPRB

 నేడు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

TSLPRB: తెలంగాణ స్టేట్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్‌, ఐటీ అండ్‌ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని నేడు (ఏప్రిల్ 15) నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పోలీసు నియామక మండలి ఏప్రిల్ 14న ఒక ప్రకటనలో తెలిపింది. TSLPRB ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, జనరల్‌ స్టడీస్‌, తెలుగు, ఉర్దూ, రెండు నాన్‌ టెక్నికల్‌ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

పోలీసు ఫైనల్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని ఏప్రిల్ 15న ఉదయం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  అయితే వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 17 వరకు వెబ్‌సైట్‌ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్‌, పీడీఎఫ్‌, జేపీజీ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు.ఫైనల్‌ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటలో తెలిపారు.

అలాగే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2023’ నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను TSLPRB ఎంపికచేస్తారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh