Ayushmann Khurrana: ఖురానా ఇంట్లో తీవ్ర విషాదం
Ayushmann Khurrana: ఈ సంవత్సరం లో సినీ పరిశ్రమంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా బాలీవుడ్‌లో విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఆయన తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
రెండు రోజులుగా సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మరో కుమారుడు అపర్ శక్తి ఖురానా కూడా నటుడే. ఈయన మరణంతో బాలీవుడ్ చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.
ఆయుష్మాన్ తండ్రి పండిత్ వీరేంద్ర ఖురానా విషయానికొస్తే. ప్రముఖ అస్ట్రాలజర్‌గా ఈయన ఫేమస్. ఆయన జ్యోతిష్యంపైనే ఎన్నో అద్భుత రచనలు కూడా చేసారు.
అంతేకాదు ఎంతో మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు దర్శక, నిర్మాతలకు ఈయన మాట అంటే గురి.
Also Watch
Varun Tej: క్రైమ్ డ్రామా సినిమా కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్
బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలకు ఈయన ముహూర్తం పెడుతూ ఉంటారు. అలా ఈయన చిత్ర సీమకు దగ్గరయ్యారు. అలాగే శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ ఖురానా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పి.ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పి.ఖురానాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయుష్మాన్ సోదరుడు అపర్శక్తి ఖురానా కూడా నటుడే కావడం విశేషం.ఆయుష్మాన్ ఖురానాకు తన తండ్రి పి.ఖురానా అంటే చాలా ఇష్టం.
సోషల్ మీడియాలో ఎక్కువగా తన తండ్రి ఫోటోలను పంచుకుంటూ.. ఆయన గురించి చెబుతుంటాడు. నటుడు కావాలనే తన కలను తండ్రి సహకారంతో నిజం చేసుకున్నాడు.
పండిత్ వీరేంద్ర ఖురానా అస్ట్రాలజర్‌గా చాలా ఫేమస్ అయ్యారు.
ఆయన మాటలను ఎంతో మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాటిస్తారు. ఆ పరిచయాలతోనే తన ఇద్దరు కొడుకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఆయుష్మాన్ ఖురానా విషయానికొస్తే ముందుగా ఎంటీవీ వీడియో జాకీగా పనిచేసిన ఈయన ‘విక్కీ డానర్’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
One thought on “Ayushmann Khurrana: ఖురానా ఇంట్లో తీవ్ర విషాదం”