Read more about the article JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది  ఊహించాడా.??
JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??. ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్. టీ ర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వ్వర్గాలు. నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ప్రస్తుతం తన ఫాం కొనసాగిస్తున్న JUNIOUR NTR రాజకీయాల్లో రావాలంటే చాలా కథ ఉంది.నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ ని అభిమానిస్తున్నారు అని అనుకుంటే పొరపడినట్టే. ఈ గొడవ వల్ల కేవలం తారక్ కి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నుంచే సపోర్ట్ ఉందని అర్ధమవుతుంది.ఊహించే JUNIOUR  NTR ఎక్కడ టంగ్ స్లిప్ అవకుండా మాట్లాడాడు.అయితే ఎన్.టి.ఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు హుందాగా ఉన్నా ఇది మాకు సరిపోదు వైసీపీ వాళ్లని బండబూతులు తింటాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు.. మరి ఈ విషయంపై JUNIOUR NTR కూడా తన వెనక ఉన్న అసలు మద్ధతుదారులు ఎవరు అన్నది విశ్లేషించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి తను కేవలం సినిమాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్న తారక్ కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం కామన్ అయ్యింది.   https://youtu.be/XHKGPA8lHe4   విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,JUNIOUR NTR కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు. అర్జున్ కోసం కాజల్ ' ఉ ' అంటాదా? సుకుమార్…

Continue ReadingJUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??
Read more about the article Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…
Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు...

Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…

Ratan Tata-టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటాగారి గురించి… https://youtu.be/INdsLTvPHgg Ratan Tata December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM…

Continue ReadingRatan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…
Read more about the article NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు
NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు

NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు

NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు. NTR- టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది . గతంలో బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే . అయితే ఆయా హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవరిన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తున్నారు . ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి , పవన్ కల్యాణ్ జాల్సా , రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి . https://youtu.be/4-5MtCJiOpg కలెక్షన్స్ పరంగా పోకిరి , జాల్సా చిత్రాలు అదుర్స్ అనిపించాయి . ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ చిత్రం కూడా రాబోతోంది . NTR కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం , ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ' ఆది ' . వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్కు నవంబర్లో భారీ ఎత్తున సన్నాహాలు రాయలసీమ జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి . జూనియర్ NTR ఇండస్ట్రీకి వచ్చి 22 న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్లో సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ' ఆది ' చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం . కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3 వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పారు. . ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ , సంబరాలు చేసుకుంటున్నారు . ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు.. సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య…

Continue ReadingNTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు
Read more about the article JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?
JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం

JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?

JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?   JAGAN జీవితం వడ్డించిన విస్తరి. సమస్యలు ఉండే చాన్స్‌ లేదు. జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకొని రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రికి సమస్యలు ఉండటానికి వీల్లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం ఎలా? అన్న దిగులు కూడా ఆయనకు లేదు. చేస్తున్న అప్పులు ఎలా తీర్చాలా? అన్న చింత అసలే లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ధ్యాసే ఉండదు. న్యాయస్థానాలు తప్పుబడుతున్నా లెక్క ఉండదు. రాష్ట్రం ఏమైపోయినా బటన్లు నొక్కుతూ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోగలిగితే చాలు అనుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డికి ఇతరత్రా సమస్యలు ఉండటానికి అవకాశం లేదు. రాష్ర్టానికి రాజధాని లేదన్న బాధ లేదు. ఎవరు ఏమైపోయినా తనకు ప్రతి నెలా వివిధ మార్గాలలో రావాల్సిన సొమ్ము వచ్చిపడుతున్నందున ఆ డబ్బును లెక్కపెట్టుకుంటూ హాయిగా గడిపేయవచ్చు. అయినా జగన్‌కు జుట్టు ఎందుకు రాలిపోతున్నదో తెలియదు. అయితే ముఖ్యమంత్రి JAGAN రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సగటు రాజకీయ నాయకుడికి భిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకొనే నిర్ణయాల వెనుక ఉన్న అంతరార్థం అంత తేలికగా అంతుపట్టదు. ఈ క్రమంలో తన బుర్రను మథించడం వల్ల ఆయనకు జుట్టు రాలుతున్నదేమో తెలియదు. దుష్ట తలంపులు, దుష్ట పన్నాగాలకు తెర లేపాలంటే కూడా తెలివితేటలు కావాలి. ఈ తరహా తెలివితేటలు జగన్‌కు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. మామూలుగా ఆలోచించే వారికి, చూసేవారికి జగన్మోహన్‌ రెడ్డి ఇటువంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని అనిపిస్తుంది. అయితే రాజకీయ పరమార్థం లేకుండా జగన్‌రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోరు. ఇది కూడా ఆ బాపతే కావొచ్చు. అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధానికి భూములిచ్చిన రైతులు చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నందున ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడం కోసం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన ఉన్నప్పటికీ అంతకంటే లోతైన ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వల్ల వైసీపీకి నష్టం కలుగుతుందని, ఈ నిర్ణయాన్ని ఆ పార్టీలో కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి అంత అమాయకంగా సొంత పార్టీకి నష్టం చేస్తారని భావించలేం. తన సొంత సోషల్‌ మీడియా సైన్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకొని ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డి సభలో బిల్లు పెట్టారు. దీంతో జగన్‌ నిర్ణయాన్ని సమర్థించే పోస్టులు, చంద్రబాబును దెప్పిపొడిచే…

Continue ReadingJAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?