AP CM Cup: ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌

AP CM Cup: ఘనంగా ప్రారంభించిన ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌

AP CM Cup: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌ తిరుపతి జిల్లాలో జరగడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ టోర్నమెంట్‌ను ఆరంభించారు. తిరుపతిలో మే 1- 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది.

పురుషులు, మహిళల కోసం 14 విభాగాలలో ఈ టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, శ్యాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, యువజన సర్వీసులు ప్రధాన కార్యదర్శి, వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, శ్యాప్ వీసీ అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్  నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు.

Hyderabad Rains: తెలంగాణ లో ఈ రోజు భారీ వర్షం పడే అవకాశం

మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్ర లో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇది గొప్ప కార్యక్రమం అన్నారు.సుమారు 4900 మంది మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారని అన్నారు.

ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌

అలాగే తిరుమల శ్రీవారి పాదాల చెంత క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు.మనం క్రీడలలో పాల్గొనడం గెలిచేందుకు పోటీ పడాలని, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని అన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడల పోటీలలో గెలుపొందిన నేడు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే అర్హతతో ఇక్కడికి వచ్చారని మీరు ఇప్పటికే అందరూ సగం గెలిచారని, గెలుపు ఓటములు సహజమని ఓడినవారు బాధపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు.

అలాగే రాష్ట్రస్థాయి AP CM Cup క్రీడలకు కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు గా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు.

క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సిఎం కప్ 2023 డిక్లరేషన్ తో క్రీడలను ప్రారంభించారు.

అలాగే శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి గారి ప్రోత్సహం తో సంక్రాంతి సంబరాలు, జగనన్న క్రీడా సంబరాలు తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించామని, చదువుకున్న వారే కాకుండా క్రీడాకారులు కూడా అభివృద్ధి చెందాలని  ఈ ప్రభుత్వంలో వివిధ క్రీడాకారులకు 2500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాం’’ అని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, సంతోషంగా ఉండాలని, స్నేహితులతో సంతోషంగా గడపాలని  టోర్నమెంట్లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Leave a Reply