Read more about the article JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది  ఊహించాడా.??
JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??

JUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??. ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్. టీ ర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వ్వర్గాలు. నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ప్రస్తుతం తన ఫాం కొనసాగిస్తున్న JUNIOUR NTR రాజకీయాల్లో రావాలంటే చాలా కథ ఉంది.నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ ని అభిమానిస్తున్నారు అని అనుకుంటే పొరపడినట్టే. ఈ గొడవ వల్ల కేవలం తారక్ కి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నుంచే సపోర్ట్ ఉందని అర్ధమవుతుంది.ఊహించే JUNIOUR  NTR ఎక్కడ టంగ్ స్లిప్ అవకుండా మాట్లాడాడు.అయితే ఎన్.టి.ఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు హుందాగా ఉన్నా ఇది మాకు సరిపోదు వైసీపీ వాళ్లని బండబూతులు తింటాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు.. మరి ఈ విషయంపై JUNIOUR NTR కూడా తన వెనక ఉన్న అసలు మద్ధతుదారులు ఎవరు అన్నది విశ్లేషించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి తను కేవలం సినిమాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్న తారక్ కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం కామన్ అయ్యింది.   https://youtu.be/XHKGPA8lHe4   విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,JUNIOUR NTR కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు. అర్జున్ కోసం కాజల్ ' ఉ ' అంటాదా? సుకుమార్…

Continue ReadingJUNIOUR NTR-వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??

నవరాత్రులలో నాలుగోవ రోజు అమ్మవారు లలితాదేవిగా దర్శనం.

శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌! త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగోవ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాధలున్నాయి . సప్తశతి రెండవ అధ్యాయంలో ఆమె అవతార గాధ అనేక సంకేతార్ధాలలో కానవస్తుంది . దేవదానవుల యుద్ధం నూరేళ్ళపాటు సాగింది . ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు . నిలువ నీడలేని వారు త్రిమూర్తుల నాశ్రయించారు . ||| స్థితికారకుడైన శ్రీ మహా విష్ణువు దేవతల దుస్థితిని చూసి కోపించాడు . అతని ముఖం నుండి క్రోధం వెలువడి , కొద్ది సేపట్లో మహోజ్వలంగా వెలగసాగింది . ఆ మహాద్భుత శక్తిని చూచి , బ్రహ్మ రుద్రులు తల్లడిల్లి పోయారు . శృతిలయ శక్తులు జ్వాలారూపంలో వెలువడ్డాయి . తమ అంతశ్శక్తి తేజోరూపంలో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు . కాని కోపొక్తులుగా వున్నారు . త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశ్శక్తి , అగ్ని పర్వతంలా విజృంభించి , సమస్త విశ్వాన్ని ఆక్రమించింది . ఆ చిచ్చక్తి మాతృరూపం దాల్చింది . మహామాత తేజఃపుంజాలు లోకమంతటినీ కాంతిమంతం కనిపించాయి . దేవతలు ముగ్ధులై లోకమాత నవలోకించి ' హే జగజ్జననీ ' అంటూ కేలుమోడ్చారు ! వాత్సల్యపూర్ణమైన ఆమె ప్రసన్నవదనం నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసింది . " త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్చాశక్తి , జ్ఞానశక్తి , క్రియాశక్తి స్వరూపిణిగా , త్రిగుణాత్మికగా స్తుతింపబడింది . పరమేశ్వరుని శుద్ద మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి , ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణీ అయ్యింది . ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి . విశ్వస్థితి కారకములగు బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి . విశ్వస్థితి కారకములగు ఆ హస్తములు శిష్టరక్షణకు ప్రతీకలు . పూర్ణచంద్ర స్వరూపముగల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన భౌద్దిక , ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుచున్నాయి . ఆమె పాదద్వయం బ్రహ్మ స్పష్టశక్తి సంకేతం అనంత చలనము సూచించు జీవచైతన్యం . ఆమె…

Continue Readingనవరాత్రులలో నాలుగోవ రోజు అమ్మవారు లలితాదేవిగా దర్శనం.

Super star Mahesh babu Mothers Death.

సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది (mahesh babu mother death). ఆయన సతీమణి ఇందిరా దేవి (Krishna Wife Indira Devi) ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణం అని తెలుస్తోంది. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇందిరా దేవికి కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అందువల్ల, ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. సుమారు నెల రోజుల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్, ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూ ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ రోజు ఉదయం ఇందిరా దేవి కన్నుమూశారు. ''ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, Mahesh Babu మాతృమూర్తి శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఆవిడ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు'' అని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. https://youtu.be/VANfnI3GExM కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు... ఇద్దరినీ తెలుగు చిత్రసీమకు హీరోలుగా పరిచయం చేశారు కృష్ణ, ఇందిరా దేవి దంపతులు. రమేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత నటన నుంచి విరామం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఆయన మరణించారు. మహేష్ బాబు అగ్ర హీరోగా ఎదిగారు. ఆయనకు ఉత్తరాదిలో కూడా ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. నాకు దైవంతో సమానం : మహేష్ బాబు తల్లి అంటే Mahesh Babu ఎంతో ప్రేమ. పలు సందర్భాల్లో తల్లిపై తనకు ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఆయన చాటుకున్నారు. ''అమ్మ అంటే నాకు దైవంతో సమానం. నేను టెన్షన్ పడినా... ఏ విషయంలో అయినా నెర్వస్ గా అనిపించినా... అమ్మ దగ్గరకు…

Continue ReadingSuper star Mahesh babu Mothers Death.
Read more about the article Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…
Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు...

Ratan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…

Ratan Tata-టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటాగారి గురించి… https://youtu.be/INdsLTvPHgg Ratan Tata December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM…

Continue ReadingRatan Tata-ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు…
Read more about the article NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు
NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు

NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు

NTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు. NTR- టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది . గతంలో బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే . అయితే ఆయా హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవరిన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తున్నారు . ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి , పవన్ కల్యాణ్ జాల్సా , రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి . https://youtu.be/4-5MtCJiOpg కలెక్షన్స్ పరంగా పోకిరి , జాల్సా చిత్రాలు అదుర్స్ అనిపించాయి . ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ చిత్రం కూడా రాబోతోంది . NTR కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం , ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ' ఆది ' . వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్కు నవంబర్లో భారీ ఎత్తున సన్నాహాలు రాయలసీమ జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి . జూనియర్ NTR ఇండస్ట్రీకి వచ్చి 22 న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్లో సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ' ఆది ' చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం . కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3 వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పారు. . ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ , సంబరాలు చేసుకుంటున్నారు . ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు.. సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య…

Continue ReadingNTR మళ్ళీ రికార్డ్స్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు
Read more about the article JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?
JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం

JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?

JAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?   JAGAN జీవితం వడ్డించిన విస్తరి. సమస్యలు ఉండే చాన్స్‌ లేదు. జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకొని రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రికి సమస్యలు ఉండటానికి వీల్లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం ఎలా? అన్న దిగులు కూడా ఆయనకు లేదు. చేస్తున్న అప్పులు ఎలా తీర్చాలా? అన్న చింత అసలే లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ధ్యాసే ఉండదు. న్యాయస్థానాలు తప్పుబడుతున్నా లెక్క ఉండదు. రాష్ట్రం ఏమైపోయినా బటన్లు నొక్కుతూ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోగలిగితే చాలు అనుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డికి ఇతరత్రా సమస్యలు ఉండటానికి అవకాశం లేదు. రాష్ర్టానికి రాజధాని లేదన్న బాధ లేదు. ఎవరు ఏమైపోయినా తనకు ప్రతి నెలా వివిధ మార్గాలలో రావాల్సిన సొమ్ము వచ్చిపడుతున్నందున ఆ డబ్బును లెక్కపెట్టుకుంటూ హాయిగా గడిపేయవచ్చు. అయినా జగన్‌కు జుట్టు ఎందుకు రాలిపోతున్నదో తెలియదు. అయితే ముఖ్యమంత్రి JAGAN రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సగటు రాజకీయ నాయకుడికి భిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకొనే నిర్ణయాల వెనుక ఉన్న అంతరార్థం అంత తేలికగా అంతుపట్టదు. ఈ క్రమంలో తన బుర్రను మథించడం వల్ల ఆయనకు జుట్టు రాలుతున్నదేమో తెలియదు. దుష్ట తలంపులు, దుష్ట పన్నాగాలకు తెర లేపాలంటే కూడా తెలివితేటలు కావాలి. ఈ తరహా తెలివితేటలు జగన్‌కు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. మామూలుగా ఆలోచించే వారికి, చూసేవారికి జగన్మోహన్‌ రెడ్డి ఇటువంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని అనిపిస్తుంది. అయితే రాజకీయ పరమార్థం లేకుండా జగన్‌రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోరు. ఇది కూడా ఆ బాపతే కావొచ్చు. అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధానికి భూములిచ్చిన రైతులు చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నందున ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడం కోసం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన ఉన్నప్పటికీ అంతకంటే లోతైన ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వల్ల వైసీపీకి నష్టం కలుగుతుందని, ఈ నిర్ణయాన్ని ఆ పార్టీలో కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి అంత అమాయకంగా సొంత పార్టీకి నష్టం చేస్తారని భావించలేం. తన సొంత సోషల్‌ మీడియా సైన్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకొని ఆ తర్వాత జగన్మోహన్‌ రెడ్డి సభలో బిల్లు పెట్టారు. దీంతో జగన్‌ నిర్ణయాన్ని సమర్థించే పోస్టులు, చంద్రబాబును దెప్పిపొడిచే…

Continue ReadingJAGAN-కుల రాజకీయాలతో ఇంకెంత కాలం?
Read more about the article Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.
Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం.... విపక్షాలు సైతం విమర్శలు.

Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.

Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం.... విపక్షాలు సైతం విమర్శలు.   Sr Ntr-నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లు ఆమోదించుకుంది. చంద్రబాబు కంటే తనకే ఎన్టీఆర్ అంటే గౌరవం ఉన్నదని సభలో చెప్పుకున్న జగన్, ఈ సందర్భాన్ని చంద్రబాబుమీద ఎదురుదాడికి, ఆడియోలూ వీడియోల ప్రదర్శనకు సభా సమయాన్ని వాడుకున్నారు. తాను ఓ పక్క Sr Ntrపేరు చెరిపేస్తూనే, కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని నిలదీస్తున్నారు. తెలుగుప్రజలంతా అన్నగా ఆరాధించే నందమూరి తారకరామారావుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అవమానం తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ నిమిత్తం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యపై ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. పిదపకాలం ముంచుకొస్తే పెడబుద్ధులు పుడతాయని పెద్దలు అంటారు. జగన్మోహన్ రెడ్డి అధికార ప్రస్థానమే వినాశనంతోనూ, కూల్చివేతలతో మొదలైంది. వ్యవస్థల నిర్మాణం కంటే కూల్చిందే ఎక్కువ కనుక నిర్మించడంలో ఉన్న కష్టం ఆయనకు తెలియదు. చరిత్ర తెలియనివారే ఇటువంటి విధ్వంసాలకు పాల్పడతారు. అప్పట్లో మెడికల్ కాలేజీలు ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉంటూ, అల్లర్లు ఆందోళనల వంటి పలు కారణాలతో పరీక్షలు వాయిదాపడుతూ, నకిలీ సర్టిఫికేట్ల సమస్యతోనూ, అర్హులైన బోధకులు లేక వైద్యవిద్య పతనమైన స్థితిలో, దేశంలోనే తొలిసారిగా ఎన్టీరామారావు పూనిక వహించి ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అన్ని దేశీయ వైద్యవిధానాలనూ, పారా మెడికల్ కోర్సులనూ ఈ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర వైద్యవిద్యకు విలువనూ, సాధికారతనూ సమకూర్చారు. పటిష్టమైన చట్టాలతో మెడికల్ కాలేజీలను ఇలా ఆయన ఓ దారికి తెచ్చిన వెంటనే తమిళనాడు అనుసరించింది, మిగతా రాష్ట్రాల్లోనూ హెల్త్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ మానసపుత్రిక. ఆయన ముందుచూపునకు నిదర్శనం. తెలుగుగడ్డమీద వేలాదిమందిని నైపుణ్యం గల వైద్యవిద్యార్థులుగా తీర్చిదిద్ది, అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకొనేట్టు చేసింది. అందువల్లనే, ఆయన మరణానంతరం Sr Ntr పేరు పెట్టినందుకు తెలుగుప్రజలంతా సంతోషించారు. అటువంటి మహనీయుని పేరును నిష్కారణంగా తొలగించడం ఉన్మాదం కాక ఇంకేమిటి? రాష్ట్రంలో సాగుతున్న విద్వేషపూరిత పాలనకు పరాకాష్ఠ ఈ నిర్ణయం. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యరంగంలో చేసిన కృషిని ఎవరూ కాదనడం లేదు. ఇప్పటికే గత పథకాలన్నింటి పేర్లూ చెరిపేసి, ఆయా వృత్తులతో సంబంధం లేకున్నా వైఎస్ఆర్ పేరు పెట్టారు. కొన్ని పథకాలకు జగనన్న తోక తగిలించుకున్నారు. చివరకు అంబేడ్కర్‌నూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు సంస్థలమీదా, వ్యవస్థలమీదా పడ్డారు. ఒక కొత్త సంస్థను సృష్టించి తండ్రిపేరో, తనపేరో పెట్టుకోవచ్చు, ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వినూత్న వ్యవస్థలను…

Continue ReadingSr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.
Read more about the article sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..
sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..

sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..

sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..   sachin tendulkar-భారతదేశానికి క్రికెట్ ఒక మతం అయితే. ఆ మతానికి ఏకైక దేవుడు సచిన్ టెండుల్కరే. టీమిండియాలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ సచిన్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు అంటే చాలు. సచిన్.. సచిన్.. అన్న హోరు సముద్రపు అలల హోరు కంటే ఎక్కువగా వినిపించేది. అయితే sachin tendulkar రిటర్మైంట్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ అతడిలో మాత్రం ఆ కళాత్మకమైన క్లాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. భారత్ వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కేవలం 5.5 ఓవర్లే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగింది 5.5 ఓవర్లే అయినప్పటికీ ఈ గేమ్ లో సచిన్ కళాత్మక ఆటకు ఫ్యాన్స్ మాత్రం ఫిదా అయ్యారు.రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా 12వ మ్యాచ్ ఇండియా లెజెండ్స్-న్యూజిలాండ్ లెజెండ్స్ మధ్య ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియాంలో జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ లెజెండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మెుదటి నుంచే ఎదురుదాడికి దిగింది. సచిన్ తో ఓపెనర్ గా జతకట్టిన నమన్ ఓజా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.   https://youtu.be/0qhPpHIBfpY   ఓజా 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి షేన్ బాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 3.5 ఓవర్లకు 32/1. మరో ఎండ్ లో సచిన్ కూడా నేటి కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 13 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. రైనా (9)రన్స్ తో క్రిజ్ లో ఉండగా 5.5 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి భారత లెజెండ్స్ స్కోరు 5.5 ఓవర్లకు 49/1 తో నిలిచింది. sachin tendulkar- క్లాస్ బ్యాటింగ్.. అదేంటి సచిన్ కొట్టింది కేవలం 19 పరుగులే కదా? మీరేంటి సచిన్ క్లాస్ బ్యాటింగ్ అంటున్నారు అనుకుంటున్నారా! “అన్నం ఉడికిందా లేదా.. అని అన్ని మెతుకులు పట్టుకుని చూడాలా! ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిదూ” అన్నట్లుగానే. sachin tendulkar- ఒక్క షాట్ చూస్తేనే అతడి కళాత్మకమైన ఆట ఇంకా తగ్గలేదు అని మనకు తెలుస్తుంది. తాజాగా న్యూజిలాండ్ లెజెండ్స్…

Continue Readingsachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..
Read more about the article Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా
Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన `నరసింహనాయుడు` సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి `మృగరాజు`, వెంకటేష్ `దేవి పుత్రుడు` సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన `నరసింహనాయుడు` సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్యకు సన్నిహితుడైన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యను అభినందించడానికి వచ్చారు. మాటల సందర్భంలో ఇలాంటి సమయంలో ఓ జానపద చిత్రం చేస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఇద్దరు భావించారు.   https://youtu.be/bjeEfPjuF-4   ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్ చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. దర్శకుడుగా కోడి రామకృష్ణను అనుకున్నారు. ఈ సినిమాలో Balakrishna ప్రతాప వర్మ, విక్రమ సింహ భూపతి అనే రెండు క్యారెక్టర్లలో నటిస్తాడు. Balakrishna ఓ అడవిలో తన నానమ్మతో కలిసి ప్రతాప్ వర్మ క్యారెక్టర్ లో ఉంటాడు.అయితే కొందరు బందిపోటు దొంగలు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వస్తారు. ఆ సమయంలోప్రతాప వర్మను చూసి వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ప్ర‌తాప్‌వ‌ర్మ ఎవరో కాదు ఆ సామ్రాజ్యానికి యువరాజు. బాలయ్య తండ్రి విక్రమసింహా భూపతి ( సీనియ‌ర్ బాల‌య్య‌) ఆ సామ్రాజ్యానికి మహారాజు. అయితే కొందరు వెన్నుపోటు పొడిచి విక్రమసింహ భూపతిని చంపేస్తారు. అప్పుడు బాలయ్యను తీసుకుని అతడి నానమ్మ ఓ గూడేనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ వర్మ తన తండ్రి మరణానికి కారుకులైన వారిని అంతం చేసి తిరిగి రాజ్యాన్ని ఎలా ? దక్కించుకున్నాడు అన్న కథాంశంతో ఈ సినిమాను అనుకున్నారు.అయితే ఇందులో చాలా మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరోయిన్‌గా సీనియర్ బాలయ్యకు జోడిగా రోజాను ఎంపిక చేశారు. అలాగే జూనియర్ బాలయ్యకు జోడిగా టక్కరి దొంగ సినిమా హీరోయిన్ లీసారేతో పాటు పూజా పాత్రను అనుకున్నారు. అయితే లీసారే ప్లేస్ లోకి అంజలా జవేరి వచ్చి చేరింది. 2001లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2002 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. దాదాపు సగం వరకు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో రెండు పాటలు…

Continue ReadingBalakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా
Read more about the article nandamuri balakrishna- మెగా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.
Nandamuri balakrishna big a budget movie in the mega banner.

nandamuri balakrishna- మెగా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.

nandamuri balakrishna- మెగా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.   nandamuri balakrishna కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఆ తర్వాత మరింత విజయాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. మలినేని దర్శకత్వంలో గోపీచంద్ తన 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా అభిమానుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ నెవర్ బిఫోర్ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ మరో రెండు మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాలయ్యతో సినిమా చేసేందుకు కొందరు మాస్ దర్శకులు గత కొన్ని నెలలుగా చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ స్క్రిప్ట్ పూర్తిగా నచ్చే వరకు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. త్వరలోనే ఓ దర్శకుడికి ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీని తీసుకురాబోతున్నాడు కొరటాల శివ. ఇప్పటికే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాని తెరకెక్కించిన కొరటాల శివ మరోసారి నందమూరి హీరోతో సినిమా చేయబోతున్నాడు. అలాగే నందమూరి బాలకృష్ణతో ఓ ప్రాజెక్ట్ చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ సినిమాను మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ పై నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అరవింద్ తో తిరుగులేని షో చేసిన బాలయ్య బాబు ఇప్పుడు సినిమా కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కొన్ని కథలు చర్చలు జరిగాయి కానీ ఏదీ ఫైనల్ కాలేదు. అయితే కొరటాల శివ మంచి స్టోరీలైన్ చెప్పడంతో బాలయ్య బాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసిన తర్వాత బాలయ్య బాబుతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   రాజమౌళిపై బ్రిటిష్ వారి ఆగ్రహం... అమెరికన్ల మద్దతు.   RRR... రాజమౌళి దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి హాలీవుడ్‌ నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అయితే యూకేలో ఈ…

Continue Readingnandamuri balakrishna- మెగా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.