సొంత గడ్డ పై ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ

ఐపిఎల్ 2023 -మంచి జోరుగా సాగుతోంది. ప్రతి మ్యాచ్‌ దాదాపు చివరి బాల్‌ వరకు వెళ్తోంది. ఏకపక్ష విజయాల ఊసేలేదు. థ్రిల్లర్‌ మూవీలకు మించి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరో బిగ్‌ ఫైట్‌ జరగనుంది. అయితే.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. తొలి విజయం కోసం వార్నర్‌ సేన ఎదురుచూస్తోంది. ఇక ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి మంచి ఆరంభం పొందినా.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఢిల్లీపై ఎలాగైనా గెలిచి రెండో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.

సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ శుభారంభం అందించారు. కోహ్లి అర్ధ శతకంతో మెరువగా డుప్లెసిస్‌ 22 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహిపాల్‌ లామ్రోర్‌ 26, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 24 పరుగులు చేశారు. హర్షల్‌ పటేల్‌ 6 పరుగులకే పెవిలియన్‌ చేరగా షాబాజ్‌ అహ్మద్‌ (12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు.

ఇక దినేశ్‌ కార్తిక్‌ డకౌట్‌ కాగా అనూజ్‌రావత్‌ 22 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ మార్షల్‌, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌ ఒకటి, లలిత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని మనీశ్‌ పాండే అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా వాళ్లలో అక్షర్‌ పటేల్‌(21), అన్రిచ్‌ నోర్జే(23 నాటౌట్‌) మాత్రమే 20 పరుగుల మార్కు అందుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు.

ఇదిలా ఉంటే ఆర్సీబీ అరంగేట్ర బౌలర్‌ విజయ్‌కుమార్‌ వైషాక్‌ 3 వికెట్లతో చెలరేగడం విశేషం. ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్లలో సిరాజ్‌కు రెండు, పార్నెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh