Prabhas తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలికి happy birthday.

Prabhas తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలికి happy birthday…

దర్శక ధీరుడు రాజమౌళికి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే సత్తా, విజన్ ఉన్నాయి. కానీ అందుకు తగ్గ కటౌట్ కావాలిగా. ఆ కటౌట్ పేరు ప్రభాస్. వీరిద్దరూ కలిసి వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు. బాహుబలితో తెలుగు సినిమా గొప్పతనాన్ని దశదిశలా విస్తరించారు. నిజంగా మాట్లాడాలంటే ప్రభాస్‌ను హేట్ చేసే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించరు. అందరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులే. ప్రభాస్ మనసు వెన్న..

అందుకే ఆయన సెట్ అసిస్టెంట్ నుంచి, ఇండియా టాప్ డైరెక్టర్‌ వరకు అందర్నీ డార్లింగ్ అని పిలుస్తారు. తిరిగి ప్రభాస్‌ను కూడా అందరూ డార్లింగ్ అనే సంభోదిస్తారు. ఇప్పుడు ఈ హీరో తెలుగువాడు కాదు.. భారతీయుడు. అవును ప్రభాస్ మన తెలుగువాడు అని మనకు గర్వం ఉన్నా, అన్ని రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు అతనో ఐకాన్‌గా మారిపోయాడు. బాహుబలి సిరీస్‌తో భారతీయ సినీ ప్రేమికులు హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. సాహో ప్రభాస్ అంటూ మన్ననలు అందుకుంటున్నాడు.

ప్రభాస్‌కు ఉన్న రెబల్ బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. కానీ బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా వేసుకుని స్వశక్తితో ఎదిగాడు. కింద పడ్డాడు.. లేచాడు. ఏ అవకాాశాన్ని కూడా వృథా చేయలేదు. ప్రతి సినిమా కోసం 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాడు. బయట కాస్త లేజీ అని పేరున్న ప్రభాస్.. సెట్‌లో లైట్ వేస్తే చెలరేగిపోతారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్న ప్రయత్నాలు చేశాడు ప్రభాస్. కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చాడు. అందుకే అతనికి రికార్డులు, రివార్డులు దాసోహం అయ్యాయి.

ఇప్పుడు ట్రేడ్ పండితులు మాట్లాడే మాట అందరికీ గుర్తే. నాన్-బాహుబలి రికార్డ్స్. ఆ సినిమాతో పెట్టుకుని ముందుకు వెళ్లడం కష్టం కాబట్టి.. నాన్-బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రంతో ప్రభాస్ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు టాలీవుడ్ రూ.100 కలెక్ట్ చేస్తే అది పెద్ద విషయంగా మాట్లాడుకునేవారు. కానీ ప్రభాస్ ప్రభాస్ మూడంకెల మార్క్ పక్కన పెట్టేసి… నాలుగు అంకెల మార్క్‌ను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చాడు. దాదాపు రూ.1500 కోట్ల కలెక్షన్లతో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో కేవలం ఒక సినిమా కోసం ఐదేళ్లు ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు ప్రభాస్. తిరిగి అంతే స్థాయిలో ప్రతిఫలాన్ని సైతం అందుకున్నాడు. అందుకే కేవలం మాహిష్మతి రాజ్యమే కాదు యావత్ ప్రపంచం జయహో బాహుబలి అంటూ నినదించింది.

ఈశ్వర్ అనే సినిమాతో 2002లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు ప్రభాస్. వచ్చీ రావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కృష్ణం రాజు గారి తమ్ముడు కొడుకు అట..ఒడ్డు, పొడవు బాగున్నాడు. బాగా నటిస్తున్నాడు అని చర్చించుకున్నారు సినీ జనాలు. అక్కడినుండి ఒక్కో అడుగు వేసుకుంటూ, విజయాలు అందుకుంటూ.. తనని తాను మలుచుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు. ఈశ్వర్, రాఘవేంద్ర.. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా ప్రభాస్ పరిణితి చెందడానికి ఉపయోగపడ్డాయి.

వర్షం సినిమా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చిత్రంలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్తంలో వచ్చిన అడవి రాముడు.. క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన చక్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్‌కి ఇంకాస్త ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగాయి. ఈ సమయంలో వచ్చింది చత్రపతి. రికార్డుల దుమ్ముదులిపింది. రాజమౌళి-ప్రభాస్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రభాస్ కటౌట్‌కు జక్కన్న మార్క్ ఎమోషన్స్ తోడవడంతో.. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. ప్రభాస్‌కు డైహార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పెరిగిపోయారు. కేవలం 8 కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి 22 కోట్లు కలెక్ట్ చేసి.. ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, మున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూర్తి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడుతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డిక్షన్ కొత్తగా కనిపించింది. ఈ క్రమంలో వచ్చిన బిల్లా ప్రభాస్‌ మ్యానరిజమ్స్ మరింత షోకేస్ చేసే స్కోప్ ఇచ్చింది. ప్రభాస్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో మళ్లీ పూరితో చేసిన ఏక్ నిరంజన్ ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత వచ్చిందండి అసలైన సినిమా డార్లింగ్. ప్రభాస్ కెరీర్ లోనే అవుట్ అండ్ అవుట్ లైవ్లీ మూవీగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ప్రభాస్ స్థాయిని మరింత పెంచింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో అదరగొట్టిన ప్రభాస్ జోరుకు రెబల్ అడ్డుకట్ట వేసింది.

ఈ క్రమంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ. రైటర్ గా ఉన్న ఆయన దర్శకుడిగా మారి మిర్చి తెరకెక్కించారు. ఆ సినిమా ఘనవిజయం అని చెప్పడానికి మనమందరం సాక్షులమే కదా.. ఆ తర్వాత వచ్చిన బాహుబలి ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. ఈ మూవీ అనంతరం అనేక బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ప్రభాస్ అటువైపు అడుగులు వేయలేదు. తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుర్ర డైరెక్టర్ సుజీత్‌కు ఛాన్స్ ఇచ్చి సాహో అనే పాన్ ఇండియా మూవీలో నటించారు. కానీ సినిమాకు అనుకున్న ఫలితం దక్కలేదు. కానీ ఇక్కడ్నుంచి బాహుబలి అనంతరం ప్రభాస్ చేసే ప్రతి మూవీ పాన్ ఇండియా చిత్రంగా మారిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్ … ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ,నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె , మారుతి దర్సకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా భారీ అంచనాలు ఉన్న చిత్రాలే. మరి ఈ ప్రాజెక్టులతో ప్రభాస్ ఇమేజ్ ఇంకెంత రేంజ్‌కు వెళ్తుందో వేచి చూడాలి. అందుకే ఒకప్పుడు కృష్ణం రాజు గారి తమ్ముడు కొడుకు అని ప్రభాస్‌ని పిలిచిన జనాలు… ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటున్నారు…హీరోగా భారత దేశంలో పతాక స్థాయికి వెళ్లినా కూడా ప్రభాస్‌లో కొంచెం కూడా గర్వం, అహం కనిపించవు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్‌గా కనిపిస్తాడు. విజయాలకు పొంగిపోడు, అపజయాలకు కుంగిపోడు. లైఫ్‌ను కింగ్ సైజ్‌లా గడిపేస్తాడు.

పైకి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్న. తనను ప్రాణంలా ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎందుకు మిగిలిపోతాడు చెప్పండి. అతని కోసం ప్రజంట్ యూనివర్సల్ హీరో అనే ట్యాగ్ ఎదురుచూస్తుంది. ఇంతకీ ప్రభాస్ ఫుల్ నేమ్ మీలో ఎంతమందికి తెలుసు.. ఆయన పూర్తి పేరు…వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పాలపాటి. ప్రభాస్ పెళ్లిపై రిలేషన్‌షిప్స్‌పై చాలా రూమర్స్ వచ్చాయ్. కానీ వాటిని ఎప్పుడూ లైట్ తీసుకుంటూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టాలీవుడ్ కింగ్. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క టాలీవుడ్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం సినిమాలు వాయిదా వేసుకునే రోజులొచ్చాయ్. ఆ కీర్తిని అందించిన కటౌట్ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది pregnya media.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh