NTR జపాన్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ మాటామంతీ..!

NTR జపాన్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ మాటామంతీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నూనూగు మీసాల వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ అభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఆయన్ని అభిమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ తరువాత జపాన్ లో అంత క్రేజ్ ఉన్న ఇండియన్ హీరో తారక్ అనే చెప్పాలి.జనతా గ్యారేజ్’ టైంలో ఓ జపాన్ అభిమాని అక్కడి నుంచి మన దేశానికి వచ్చి ఎన్టీఆర్ తో ఫొటో తీసుకొని వెళ్లడంటేనే ఆయనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తారక్ యాక్టింగ్ తో పాటుగా డ్యాన్స్ లను జపనీస్ విపరీతంగా లైక్ చేస్తుంటారు.

ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు జపాన్ లోనూ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ‘బాద్ షా’ చిత్రం రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ”ఆర్.ఆర్.ఆర్” చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు.దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. అక్టోబర్ 21న జపాన్ లో విడుదల కానుంది.బాహుబలి’ ప్రాంఛైజీతో సత్తా చాటిన జక్కన్న.. ఈసారి RRR మూవీతో జపనీస్ ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ జపాన్ మీడియాతో ఆన్ లైన్ వేదికగా ముచ్చటించారు. ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన విశేషాలను వారితో పంచుకున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన తారక్.. ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “జపనీస్ మీడియాతో RRR అనుభవాన్ని తిరిగి పొందుతున్నాను. అందరి ప్రేమ మరియు ప్రశంసలకు ధన్యవాదాలు” అని తారక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
RRR సినిమా జపాన్ లోని థియేటర్లలో అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఇది అంతర్జాతీయ మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించింది. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు నామినేషన్స్ వెళ్లడానికి ఇంకా మార్గాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా RRR చిత్రంలో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించారు.

ఇందులో అలియా భట్ – ఒలివియా మోరీస్ – అజయ్ దేవగన్ – రే స్టీవెన్సన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.

 

NTR 30 పై నీరసం వచ్చేసింది.. ఇంకా చాలు లే!

ntr 30పై ఇంట్రెస్ట్ పోయింది..ఇది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ అనుకుంటున్న మాట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? అని ఎంతోకాలం నుండి ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ లో కలిసి నటించిన రామ్ చరణ్ నుండి ‘ఆచార్య’ సినిమా వచ్చింది. ఇప్పుడు ‘RC15’ సెట్స్‌పై ఉంది. కానీ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇక విజయానికి చిహ్నంగా చెప్పుకునే విజయదశమి రోజు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో.. రాకపోవడంతో.. అభిమానులు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పోయిందంటూ, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. విజయదశమికి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని.. అభిమానులు ఎంతగానో వేచి చూశారు. కానీ, మేకర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. దీంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికపై ‘NTR30’పై కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉండాలి. ఒకసారి హీరోయిన్ కారణంగా అని, ఇంకోసారి ‘ఆచార్య’ నష్టాల కారణంగా అంటూ.. ఏదేదో వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మళ్లీ కొరటాల ఈ సినిమా కథని ఇంకాస్త పకడ్బందీగా తయారు చేస్తున్నాడనేలా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించడంతో.. ఫ్యాన్స్ ‘NTR30’పై ఆశలు వదిలేసుకోవడం బెటర్ అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే.. కొరటాలను వదిలేసి.. ‘ఉప్పెన’ బుచ్చిబాబు సినిమాతోనైనా సినిమా చేస్తే బాగుండు.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

అంతగా NTR30పై వారికి నీరసం వచ్చేసింది. మరోవైపు బుచ్చిబాబు కథ సిద్ధం చేసుకుని.. ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ, కొరటాల సినిమా తర్వాత.. లేదంటే, ఆ సినిమాతో పాటే బుచ్చిబాబు సినిమా కూడా మొదలవుతుందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే, కొరటాల ఇంకా ఈ సినిమా కథని చెక్కుతున్న తీరే.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అనుమానాలతో అసలు వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? అని ఫ్యాన్స్ చేస్తోన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఫ్యాన్స్ కోసమైనా.. ‘NTR30’ టీమ్ ఏదో ఒక విషయం చెబితే బాగుండు.. లేదంటే వారి ఆవేదనకు అంతే ఉండదు.

వేట షురూ చేసిన రామ్-బోయపాటి

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా దసరా సందర్భంగా గురువారం నుంచి షూటింగ్ కూడా మొదలు పెడెతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. # బోయపాటి ర్యాపో షూటింగ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు.దీంతో రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలు కాబోతుంది. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో టీమ్ వేటకి సిద్దమవుతోంది.

ఇందులో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసారు. ఈ బ్యూటీ అధికారిక ఎంట్రీ సినిమాకి ఓ రకమైన వైబ్ ని తీసుకొస్తుంది.రామ్ ఎనర్జీకి శ్రీలీల అందంతో తోడైతే రచ్చ రంబోలా అన్న చందంగా కాంబో వైరల్ అవుతోంది. ఇద్దరు మంచి డాన్సర్స్. ఆ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ థమన్ అందించే బాణీలు మరింత ఊపు తీసుకురావడం ఖాయం.

సంగీత దర్శకుడిగా థమన్ ఎంట్రీ సినిమాని అదనపు అస్సెట్ గా చెప్పొచ్చు. `అఖండ`తో బోయపాటి-థమన్ ఎలాంటి మ్యాజిక్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.
అదే తరహా వైబ్ ని క్రియేట్ చేసేందుకు మరోసారి బోయపాటి..థమన్ నే రంగంలోకి దించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి మరింత శ్రద్దగా పనిచేసే అవకాశం ఉంది. ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ డిటాకే చాయాగ్రాహకుడిగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ని శివ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఇలా ప్రతిభావంతులపై సాంకేతిక నిపుణుల్ని రంగంలోకి దించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. రామ్-బోయపాటిలకు ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

చిరు కోరిక తీరిందా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అసలే మెగాస్టార్ రొటీన్ సినిమాలు చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. దానికి తోడు రీమేక్ సినిమాలు అంటే ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపుకోవచ్చు అనే సందేహాలు చాలానే వచ్చాయి. కానీ దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ ను చేంజ్ చేసిన విధానం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.చాలా వరకు సన్నివేశాలలో అతను మెగాస్టార్ ను చాలా పవర్ఫుల్ గా చూపించాడు అని అర్థమైంది. ఒక విధంగా ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కోరిక కూడా తీరింది అని చెప్పవచ్చు.

ఏదేమైనా కలెక్షన్స్ ను పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మొదటి రోజు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అయితే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ లేకుండా సినిమా చేసి సక్సెస్ కొట్టిన సందర్భాలు అయితే లేవు.కె.విశ్వనాథ్ లాంటి దర్శకుడితో కూడా అప్పట్లో చేసిన ఆపద్బాంధవుడు సినిమా ఆయనను చాలా నిరాశకు గురి చేసింది. ఆ సినిమాకు అవార్డులు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అనే భావనతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అంతేకాకుండా డాడీ అనే సినిమా సమయంలో కూడా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అందులోనూ కమర్షియల్ అంశాలు ఇరికించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు. ఒక విధంగా చిరంజీవి అభిమానుల కారణంగా ఎంతగా సంతోషించారో అలాగే ఫ్యాన్స్ వల్లనే నిరాశపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కోరిక మేరకు అలాగే ఒకే విధమైన రొటీన్ సినిమాలు చేస్తూ ఉండేసరికి ఆయనకు కూడా బోరింగ్ కొట్టేసింది.ఇక ఈసారి గాడ్ ఫాదర్ సినిమా కరెక్ట్ అని రాంచరణ్ ఒప్పించి మరి సినిమా చేశారు. ఒక విధంగా లూసిఫర్ అనగానే మెగాస్టార్ కు ఏమాత్రం కరెక్ట్ కాదని అందరూ అనుకున్నారు.కానీ దర్శకుడు తెలివితో ఈ సినిమా నుంచి న్యాయమైతే చేశాడు. సినిమా సక్సెస్ తో పాటు మెగాస్టార్ సంతృప్తి చెందే విధంగా గాడ్ ఫాదర్ రిజల్ట్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh