Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.

Modi నవంబర్ 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఏపీలోని విశాఖపట్నం నగరానికి రానున్నారు. నవంబరు 11న విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ నవీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వివరాలు అందినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న మరికొన్ని ప్రాజెక్టులకు, పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అంనతరం వైజాగ్‌లో జరగనున్న బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగించనున్నారు.

2. మునుగోడు సెంట్రిక్‌గా హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం.

మునుగోడు ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం హైవోల్టేజ్‌లో కొనసాగుతోంది. ఎవర్ని టచ్‌ చేసినా.. హాట్‌ కామెంట్స్‌ హీటెడ్‌ డిబేట్‌ బయటికొస్తోంది. అంతేకాదు పార్టీల క్యాంపేన్‌ కూడా వినూత్న రీతిలో కొనసాగుతోంది. రాత్రికి రాత్రే వెలసే పోస్టర్లు.. వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు బైపోల్‌ని బడా దంగల్‌గా మార్చేస్తున్నాయి.

ప్రచార పర్వంలో లేఖలు, పోస్టర్లను విడుదల చేస్తూ పార్టీలు పైచేయి సాధించేందుకు చూస్తున్నాయి. లేటెస్టుగా బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌.. కేసీఆర్‌ పాలనపై వాల్‌ పోస్టర్లు విడుదల చేస్తే.. అటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. ప్రధాని మోదీకి రాసిన లేఖని విడుదల చేసి హీట్‌ రెట్టింపు చేశారు. బండి సంజయ్‌.. కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు వదిలితే.. అటు కేటీఆర్‌, ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు సంధించారు.

 

3. ముంపు ప్రాంతాలకు రెవిన్యూ డివిజన్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం !

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలతో చింతూరు రెవెన్యూ మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు.

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవి ఉన్నాయి. అయితే ఈ ప్రాంత ప్రజలకు పాడేరు దూరాభారం కావడంతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

4. బస్సును ఆపావా.. సైకిల్ ను ఆపావా.

ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో బస్సులు ముందు వరసలో ఉంటాయి. ప్రతి గ్రామానికి వెళ్తూ సేవలందిస్తుంటాయి. చెయ్యెత్తిన చోట ఆపుతూ.. అడిగిన చోట ఆపుతూ ప్రజలకు దగ్గరయ్యాయి. మీలో చాలా మంది ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో ప్రయాణించే ఉంటారు.

దేశంలో దాదాపు ప్రతిచోటా బస్సు సౌకర్యం ఉంది. ఢిల్లీ, ముంబయియ, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు మెట్రో తర్వాత బస్సులనే అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించడానికి బస్సులు అత్యంత అనుకూలమైన, ఆర్థిక పరమైన మార్గం. ఢిల్లీలో బస్సులు సాధారణంగా బస్టాండ్‌లు ఉన్న చోట ఆగుతుంటాయి. గ్రామాలకు వెళ్లే బస్సులైతే దారి మధ్యలో చేయి ఎత్తి ఆపగానే ఆగుతాయి. ఇది అందరికీ అనుభవమే.

అయితే కొంద మంది ఆకతాయిలు చేసే పనులు బస్సు డ్రైవర్లకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం బస్సుకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

5. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే సినిమా అందించనున్నారు.. ఆదిపురుష్‌పై బాలీవుడ్‌ నటుడు ధీమా.

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆది పురుష్‌. అంత్యంత ప్రాతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఏమంటూ ఈ సినిమా టీజర్‌ విడుదలైందో ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టాయి.

టీజర్‌ అస్సలు బాలేదూ, యానిమేషన్‌ చిత్రంలా ఉందంటూ కొందరు వాదిస్తే, మరికొందరేమో మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటూ వివాదాలకు ఆజ్యం పోశారు. అయితే అనంతరం విడుదలైన 3డీ వెర్షన్‌ టీజర్‌తో ట్రోలింగ్‌కు కాస్త చెక్‌ పడినట్లైంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ నటుడు శరద్‌ కేల్కర్‌ ఆదిపురుష్‌కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

6. కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి.

ఇటీవల విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడ సినిమా అయిన కాంతార రీసెంట్ గా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మరోసారి ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది.

ఇక విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, కంగనా రనౌత్‌, ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమాను చూసి సూపర్బ్‌ అంటూ తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

తాజాగా కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాంతార సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక ఆ వ్యక్తి అలా కింద పడిపోవడంతో వెంటనే థియేటర్ యాజమాన్యం సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారట.

7. ఉపఎన్నిక వేళ BJPకి మాజీ ఎంపీ రాజీనామా.

మునుగోడు ఉపఎన్నిక వేళ BJPకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలోని కీలక నేతలు వరుసబెట్టి కాషాయ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. వేరే పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటుంన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి TRSలో చేరగా.. తాజాగా మరో బీజేపీ కీలక నేత కూడా కారెక్కేందుకు సిద్దమయ్యారు.మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద్‌భాస్కర్ బుధవారం కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.

అనంతరం ఇవాళ సాయంత్రంలోపు టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశముంది. ఇప్పటికే పార్టీలో చేరాల్సిందిగా రాపోల్ ఆనందభాస్కర్‌ను కేసీఆర్ ఆహ్వానించిన విషయం తెలిపిందే.

8. మన దేశం బాగుపడాలంటే కరెన్సీపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలి.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి సూచించారు. లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు మన కరెన్సీపై ఉంటే దేశం ఇంకా సంపన్నమవుతుందని అన్నారు.

మహాత్మా గాంధీ బొమ్మ పక్కనే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలూ ముద్రించాలని సూచించారు. “ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు మన కరెన్సీపై ఉంటే తప్పేంటి. ఈ విషయమై కేంద్రానికి రెండ్రోజుల్లో లేఖ రాస్తాను. ప్రస్తుత మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే” అని వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.

9. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రెండో మ్యాచులో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆడకపోవచ్చని సమాచారం.

టీమ్‌ఇండియా అభిమానులకు చేదువార్త! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రెండో మ్యాచులో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆడకపోవచ్చని సమాచారం. నెదర్లాండ్స్‌తో పోరులో అతడికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు అతడు హాజరవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం!

సూపర్‌ 12 దశలో టీమ్‌ఇండియా తన రెండో మ్యాచును నెదర్లాండ్స్‌తో ఆడుతోంది. సిడ్నీ మైదానం ఇందుకు వేదిక. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆట మొదలవుతుంది. భారత ఆటగాళ్లు ఇప్పటికే సిడ్నీ మైదానానికి చేరుకున్నారు. మంగళవారం కఠోరంగా ప్రాక్టీస్‌ చేశారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ చాలా ఎక్కువసేపు నెట్స్‌లో గడిపారు. హార్దిక్‌ పాండ్య మాత్రం ఈ సెషన్‌ అటెంట్‌ అవ్వలేదు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh