MMTS: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు MMTS సర్వీసులు రద్దు..

హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఫలక్‌నుమా లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్ మార్గాల్లో నడిచే 18 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ సబ‌ర్బన్‌కు సంబంధించి.. సనత్‌నగర్ – హఫీజ్‌పేట్‌ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైళ్లను రద్దు చేశారు. ఇందులో ఈ నెల 12న పన్నెండు రైళ్లు, ఈ నెల 13న ఆరు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని, తమకు సహకరించాలని కోరారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. అయితే.. వారాంతాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణీకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ లో రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపకుండా.. ఉన్నవాటిని తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 

శబరిమల వెళ్లే హిందూ యాత్రికుల కోసం సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు సికింద్రాబాద్ – కొల్లాం స్టేషన్ల మధ్య ఈ నెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు నడుస్తాయి. కొట్టాయం-నర్సాపూర్ మధ్య బస్సులు నడపనున్నారు. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూరు, కోయంబత్తూరు, సేలం, తిరుప్పూరు, పాలకొల్లు, ఈరోడ్‌ల నుండి బయలుదేరుతాయి. , త్రిస్సూర్. ఆల్వే మరియు ఎర్నాకులం టౌన్ స్టేషన్‌లు ఆగుతాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh