TS Elections : ఎన్నికల బరిలో సినీ ప్రముఖలు

Many film personalities in the fray for the elections

TS Elections :  ఎన్నికల బరిలో  సినీ ప్రముఖలు

TS Elections: తెలంగాణ లో మరి కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సిద్దం అవుతున్నాయి.  రాజకీయ పార్టీలు  వేగంగా పెంచుతున్నాయి అయితే  ఈ సారి సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సినీ  ప్రముఖులు సిద్దం అయ్యారు.

తెలంగాణలో ఇప్పటికే రాజకీయాల్లో సినీ ప్రముఖులు పోటీ చేసారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ బీఆర్ఎస్ జనసేన నుంచి పోటీ చేసేందుకు సినీ ప్రముఖులు సిద్దం అవుతున్నారు. విలక్షణ నటుడు ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా లేక రాజ్యసభకు నామినేట్ అవుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

విజయశాంతి బాబూ మోహన్ బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో సినీ ప్రముఖుల పోటీ చేసే పార్టీలతో పాటుగా నియోజకవర్గాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సినీ ప్రముఖులు పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో ఏకీభవించారు. కేసీఆర్ తో కలిసి ముంబాయి పర్యటనలో అప్పటి సీఎం ఉద్దవ్ థాక్రేను కలిసారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రకాశ్ రాజ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. గతంలోనే ఆయన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని ఆశించారు.

కానీ అప్పుడు  సాధ్యపడలేదు. ప్రస్తుతం కర్ణాటకలోనూ బీఆర్ఎస్ విస్తరణ ప్రారంభించారు. దీంతో అక్కడి నుంచి బరిలో ఉంటారా లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశమూ కనిపిస్తోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన ఆయన ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారని సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. కొంత కాలంగా దిల్ రాజ్ ఎన్నికల బరిలో నిలుస్తారనే అంశం పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

TS Elections : ఎన్నికల బరిలో  సినీ ప్రముఖలు

ఇప్పటికే సినీ ప్రముఖులతో బీజేపీ అధినాయకత్వం మంతనాలు చేసింది. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా నితిన్‌ మర్యాదపూర్వకంగా కలిసారు. నితిన్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ తోనూ అమిత్ షా సమావేశం అయినా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దర్శకుడు ఎన్‌.శంకర్‌ పేరు కూడా ప్రస్తుతం ప్రచారం లో ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శంకర్ సొంత నియోజకవర్గం.

జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలు తీసిన ఆయనకు  జై బోలో తెలంగాణ సినిమాతో మంచి పేరొచ్చింది. 2014 ఎన్నికల్లోనే ఆయనకు కాంగ్రెస్‌ తరఫున మిర్యాలగూడ నుంచి అవకాశం ఇస్తారనే చర్చ సాగింది. కానీ, అప్పట్లో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.

ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జైబోలో తెలంగాణ సినిమాలోనే హీరోగా నటించిన రోషన్‌ బాలు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

అయితే ఈసారి విజయశాంతి బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగనున్నారు. ఆమె జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం.

ఇక బాబూ మోహన్‌ ఎప్పట్లాగే ఆందోళ్‌ నుంచి బరిలో దిగనున్నారు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, అలాగే టీవీ ఆర్టిస్ట్‌ కత్తి కార్తీక కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈమె దుబ్బాక నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు.

నిర్మాత రామ్‌ తాళ్లూరి జనసేన పార్టీలో ఉన్నారు. చుట్టాలబ్బాయి, నేల టికెట్‌, డిస్కో రాజా తదితర సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత సొంత జిల్లా ఖమ్మం. జనసేన నుంచి అవకాశం వస్తే ఖమ్మం జిల్లా నుంచే ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి అసలు ఎన్నికల బరిలో సినీ రంగం నుంచి పోటీ చేసేది ఎవరు చివరకు టికెట్లు దక్కేదెవరకి అనే చర్చలు ఆసక్తిని రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh