పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

 

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

గత కొద్ది రోజులుగా  నిపుణులు అంచనా వేస్తున్నట్టే బంగారం ధరలు  ఆకాశం  అంటుతున్నాయి.ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చెయ్యలేనంతగా బంగారం ధరలు పెరిగాయి. రికార్డ్ స్థాయి లో   చేరుతున్న బంగారం ధరలు ముందు ముందు మరింత దూకుడును కొనసాగిస్తాయి అన్న చర్చ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బంగారం ధర 60 వేల రూపాయలకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే తాజాగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ లు పెరగటం తో బంగారం ధరలు వరుసగా రెండు రోజు బంగారం ధరలు క్షీణించాయి. అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ, ప్రస్తుతం భారీగా తగ్గుదల నమోదు చేయడం పసిడి ప్రయాణం ఎటువైపు అన్న ఆసక్తిని అందరిలో కలిగిస్తుంది.
తాజాగా హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,000 గా ఉండగా, నేడు ఒక్కరోజే 700 రూపాయలు మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే ఈరోజు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 గా ఉండగా నేడు ఒక్కరోజే 770 రూపాయలు మేర బంగారం ధర తగ్గింది.

విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,100 గా ఉంది. మొత్తం 700 రూపాయల మేర విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల విషయానికి వస్తే నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ఉంది. మొత్తం 770 రూపాయలు మేర 24 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,550గా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 53,250 గా ఉండగా మొత్తం ఢిల్లీలోనూ 700 రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారంపై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 57,310 రూపాయల ధర పలుకుతుంది. ఈ ధర నిన్న 58,080 గా ఉండగా 770 రూపాయలు ధర తగ్గింది. ముంబైలోనూ తగ్గిన బంగారం ధరలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ధర  నిన్న 53,100గా ట్రేడ్ అయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ట్రేడ్ అయ్యింది.

చెన్నైలో అత్యధికంగా తగ్గిన బంగారం ధరలు  నేడు ధరలిలా ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి చెన్నైలో 58,200 ధర ప్రస్తుతం పలుకుతుంది నిన్న ఈ ధర 59,070 గా ఉంది. చెన్నైలో అత్యధికంగా 870 రూపాయల మేర నేడు ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం చెన్నైలో నేడు 53,350లు పలుకుతుంది. ఈ ధర నిన్న 54,150 ఉంది. నిన్నటికి ఈరోజుకి 22 క్యారెట్ల మీద ఎనిమిది వందల రూపాయల మేర ధర తగ్గింది. దేశంలోనే చెన్నై, మధురై, కోయంబత్తూర్ తదితర నగరాలలో 60 వేల మార్కును దాటి బంగారం ధరలు పెరిగిన పరిస్థితి కనిపించింది. బంగారం ధరలు నేడు తగ్గిన 60 వేల మార్కును చేరుతుందని అంచనా మరికొద్ది రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాని ధరల పెరుగుదల కారణంగా  బంగారం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి ఏది ఏమైనా దూకుడును కొనసాగించిన బంగారం ధరలు ప్రస్తుతం గణనీయంగా తగ్గడం గోల్డ్ ప్రియులకు  కు కాస్త ఊరట ఇస్తుంది అనే చెప్పాలి.

 

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh