Adani crisis: తెలిసింది గోరంత…తెలియాల్సింది కొండంత

అదాని గ్రూప్… భారతదేశ వాణిజ్య రంగంలో విశిష్ట సంస్థ. అంతేకాదు దేశ ప్రభుత్వ అనుచబంధ సంస్థల్లో ప్రత్యక్ష మరియు పరోక్ష పాత్ర ఈ అదాని గ్రూప్ ది.

అందుకే నేడు అదాని పేరు మీడియాలో వస్తే ప్రభుత్వం కూడా ఒకింత గగుర్పాటుకు గురవుతుంది.  34 ఏళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని (ఆదాని గ్రూప్) ఓ 5ఏళ్ళ సంస్థ (హిడెన్ బర్గ్ రీసెర్చ్) ప్రశ్నిస్తోందంటే దానికి బలమైన కారణం ఉండే వుంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత ఆరోపణ ప్రత్యారోపణలు పక్కన పెడితే వాస్తవమన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియని బహిర్గత రహస్యం. పేరు, పలుకుబడి మరియు విశాల వ్యాపార సామ్రాజ్యం తో పాటు అనంత ఐశ్వర్యవంతులు అదాని గ్రూప్.  అంతేకాదు 34 ఏళ్ళ విశిష్ట అనుభవశాలురు.

మరి ఇప్పుడే ఈ ఆరోపణలు రావడం ఏమిటి.  సామాన్యుడికి ఇదో అంతుచిక్కని ప్రశ్న. సోషల్ మీడియా వారికి ఇది సంబరాల సమయం. ఎవరో అన్నట్టు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అన్న విషయాన్ని పక్కన పెట్టి తాము చూచిందే వేదవాక్కని, అలాగే తాము నమ్మిందే అక్షరసత్యమని ఊదరగొడుతున్న సదరు సోషలోళ్ళు కాస్త ఆగండి.

మీరు చెప్పే, చూపే వార్తలు మీ ఉనికి చాటుకోవడానికే అయినా మీ వల్ల కోట్ల నష్టం జరుగుతోంది.  ఆ నష్టం వల్ల ప్రస్తుతం మీకు నష్టం కాకపోయినా భవిష్యత్తులో నష్టపోయేది మనమే. ఆలోచించుకోండి.

ఎందుకంటే అదాని అన్నది ఇప్పుడు మీ చేతిలో వున్న వార్త కాదు, అఖండ అనంత వ్యాపార సామ్రాజ్యం. అదాని గ్రూప్ ప్రత్యక్షంగా మన భారత ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఏన్నో కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ. ఒక్కసారి అదాని షేర్ పడిపోతే మన భారతదేశ వాణిజ్యమే తడబడుతుంది.

నేడు మీ పొట్ట నింపుకోవడానికి లేని పోని అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలతో వార్తలందించడం తగదు.  రేపటి మీ తరానికి నేడు మీరే నిప్పెడుతున్నారు.  అందుకే వాస్తవాలని తెలుసుకొని ప్రచురించండి. తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియా సహోదరులు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh