4,411.68 కోట్లుతో టీటీడీ 2023-24 బడ్జెట్

టీటీడీ 2023-24 బడ్జెట్

టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. ఆదాయంలో శ్రీవారి ఆలయం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్ అంచనాలకు టీటీడీ పాలక వర్గం ఆమోద ముద్ర వేయడంతో మరో రికార్డు కైవసం చేసుకుంది టిటిడి.

అలాగే శ్రీవారి దర్శనం సామాన్యులకు సులభతరం చేసేందుకు వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పు ప్రయోజనకరంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో ఈ విధానం కొనసాగిస్తామని ప్రకటించారు. వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్ లో కొనసాగిస్తామని స్పష్టం ఈ సందర్భంగా ప్రకటన చేసారు.  అలాగే తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేశామన్నారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 2023-24 బడ్జెట్ ఫిబ్రవరి నెల 15వ తేదీన నిర్వహించడం జరిగిందని ఆ సమావేశంలో ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నామన్నారు చైర్మెన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయామని ఇప్పుడు కోడ్ ముగిసినందువల్ల వివరాలను వెల్లడించామన్నారు.

కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200 కోట్లు కానుకలు లభించేవని, కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ.1500 కోట్ల దాకా పెరిగిందని తెలిపారు. అలాగే శ్రీవారి బ్యాంక్ అక్కౌంట్స్ ల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయని, తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామనీ తెలిపారు.

ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. కాగా అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు సుబ్బారెడ్డి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh