రాహుల్‌తోనే మేము అంటు కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల పర్వం

Rahul Gandhi: రాహుల్‌తోనే మేము అంటు కాంగ్రెస్ ఎంపీలరాజీనామాలుపర్వం

 

రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనకు దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హులయ్యారు. వయనాడ్ ఎంపీపై నమోదైన కేసులో సూరత్ కోర్టు మార్చి 23న ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష విధించిన మరుసటి రోజే ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో రాహుల్ గాంధీకి మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధపడుతున్నట్టుసమాచారం .  అలాగే రాహుల్ గాంధీ సైతం జైలుకు వెళ్లేందుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇందిరాగాంధీ ఆదర్శంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారు. 1977 లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులపాటు ఇందిరమ్మ జైల్లో ఉన్నారు. కాగా ఎంపీలు మూకమ్మడిగా రాజీనామా చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. త్వరలో సూరత్ లేదా ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.

మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటు ప్రతిపక్షాల ఐక్యతకు దారి తీయనుందా!? ఇందుకు ‘ఔను’ అనే  సమాదానం వినిపిస్తుంది.  రాజకీయ వర్గాలు. మహారాష్ట్రలో శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌‌ఠాక్రే, ఢిల్లీలో కేజ్రీవాల్‌, తమిళనాడులో స్టాలిన్‌, బెంగాల్‌లో మమత నుంచి తెలంగాణలో కేసీఆర్‌ వరకూ విపక్షనేతలు స్పందించిన తీరును ఇందుకు ఉదాహరిస్తున్నాయి. రాహుల్‌పై వేటుతో రాబోయే రోజుల్లో రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయని విశ్లేషించాయి. ప్రతిపక్ష నేతల స్వరాన్ని తొక్కిపట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని శరద్‌ పవార్‌ ఆరోపిస్తే ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌, శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఆప్‌‌నేత కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు కూడా. అయితే  వారంతా స్పందించిన తీరు చూస్తే దేశంలో త్వరలో ప్రతిపక్షాల నేతృత్వంలో బలమైన ఫ్రంట్‌ ఏర్పాటుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు తన నాయకత్వం గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని, అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకే సమాయత్తమవుతోందని చెబుతున్నాయి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh