రాజేంద్రనగర్‎లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: రాజేంద్రనగర్‎లో భారీ అగ్ని ప్రమాదం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న పరిస్థితి నెలకొంది. మెున్న దక్కన్ మాల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలు మరువక ముందే ఇప్పుడు  రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  ఓ ప్లాస్టిక్ గోదామ్‎లో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదామ్‎లో నిలిపివుంచిన రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. దీంతో మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తోన్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్లు సమాచారం.

అయితే అగ్నిప్రమాదం జరిగిన గోదాం పక్కనే ఉన్న స్కూల్‎ను అధికారులు ఖాళీ చేయించారు. పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రాసే విద్యార్థులను స్థానిక ఫంక్షన్ హాల్ లేదా స్థానిక మరో పాఠశాలలో పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాటు  చేస్తామన్నారు చేస్తామంటున్నారు. అధికారులు ఇస్తున్న సమాచారం క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన గురవుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు జీహెచ్ఎంసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇక వరుస అగ్నిప్రమాదాలతో నగర ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఏ సమయంలో ఏమ్ జరుగుతుందా అనే భయంతో నగర వాసులు గడపాల్సి వస్తోంది.

అయితే గురువారం సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్ కాంప్లెక్స్‌లోని 7, 8వ అంతస్తుల్లో రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్వప్న కాంప్లెక్స్‌ లోపలు పలువురు చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బందితోపాటు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన విషయం అందరకి తెలిసిందే.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh