మూడో రోజు విచారణకి తన సెల్ ఫోన్లనులతో కవిత

Delhi Liquor Case :మూడో రోజు విచారణకి తన సెల్ ఫోన్లనులతో కవిత

దేశంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను  ఈ నెల 20న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే . అంతేకాక, అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని పెంచాలని కోరుతూ కోర్టులో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో పిళ్లై కస్టడీని ఈనెల 20వరకు కోర్టు పొడిగించింది. అయితే  దాంతో నిన్న డిల్లీ  వచ్చిన కవిత నిన్న వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆమె ఈ రోజు మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు.అయితే  విచారణకు హాజరయ్యే ముందు కవిత తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మెుత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కవిత మెుత్తం 10 ఫోన్లు మార్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మెుత్తం 36 మంది 170 ఫోన్లు మార్చినట్లు ఈడీ పేర్కొంది. ఆధారాలు చేరిపేసే క్రమంలో కవిత తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

ఈ క్రమంలో ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించటం చర్చనీయాంశంగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయ కోణంలోనే ఈడీ విచారణ జరగుతోందని కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందులో భాగంగానే ఈడీ నమోదు చేసిన అభియోగాలను తిప్పికొట్టాలనే ఉద్దేశ్యంతోనే కవిత నేడు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తన సెల్‌ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఈ రోజు విచారణ నేపథ్యంలో ఉదయం సుప్రీం కోర్టు న్యాయవాదులతో కవిత భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు న్యాయవాదులతో చర్చించారు. న్యాయవాదులతో చర్చల అనంతరం ఆమె సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకొని అక్కడి నుంచి తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు.

మెుత్తం 14 ప్రశ్నలను ఆమెపై సంధించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్ వ్యవహారాలు, అరుణ్ ఫిళ్లతో ఉన్న ఆర్థిక సంబంధాలు, హోటల్ సమావేశాలు, ఆధారాల ధ్వంసం ఇలా మెుత్తం 14 అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈనెల 11న ఆమె మెుదటిసారి విచారణకు హాజరు కాగా ఆ సమయంలో ఆమె ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈమె నేడు ఫోన్లతో ఈడీ విచారణకు హాజరయ్యారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh