పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ 

Gold Silver Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే  బంగారం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పసిడి రేటు ఈ వారంలో భారీగా పెరిగింది.  బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ వారం చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అమెరికా బ్యాంక్ సంక్షోభం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటివి బంగారం ధర పరుగుకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల్లో ఏకంగా రూ. 3,500 వరకు పెరిగింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 56,890 నుంచి రూ. 60,320 స్థాయికి చేరాయి. వారంలో ఒక్క రోజు మినహా మిగతా అన్ని రోజులు బంగారం రేటు పెరుగుతూనే వుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా దూసుకుపోయింది. పది గ్రాముల బంగారం ధర రూ. 52,150 నుంచి రూ. 55,300 స్థాయికి చేరింది. అంటే బంగారం రేటు దాదాపు రూ. 3,200 పైకి కదిలింది
అలాగే బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పరుగులు పెడుతుంది. వారం రోజుల్లో సిల్వర్ రేటు ఏకంగా రూ. 5,700 వరకు పెరిగింది. దీంతో వెండి కొనాలని భావించే వారిపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. సిల్వర్ రేటు ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీకి రూ. 74,400 వద్ద ఉంది. వారం కిందట ఈ వెండి రేటు రూ. 68,700 వద్ద ఉండేది. అంటే సిల్వర్ రేటు భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ వారం బంగారం, వెండి ధరలు రెండూ కూడా భారీగా పెరిగాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే బంగారం ధరలు కొండెక్కాయి. పసిడి రేటు ప్రస్తుతం ఔన్స్‌కు 2 వేల డాలర్లకు సమీపంలో ఉంది. వెండి రేటు అయితే ఔన్స్‌కు 23 డాలర్లకు చేరువలో ఉంది. కాగా బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh