తెలంగాణ మిల్లెట్ మ్యాన్ ఇక లేరు

PV SATEESH: తెలంగాణ మిల్లెట్ మ్యాన్ ఇక లేరు

తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా పేరొందిన  పిరియాపట్న వెంకట సుబ్బయ్య సతీష్ (సతీష్77) తుది శ్వాస విడిచారు.డీడీవైఎస్ డైరెక్టర్ పీవీ.సతీష్ ఆదివారం  తెల్లవారు జామున ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  జీవ వైవిధ్యం, ఆహార సౌర్వ భౌమ త్యం, మహిళా సాధికారికత కోసం ఉద్యమించడంతో పాటు 1983లో జహీరాబాద్ కేంద్రంగా డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఏర్పాటు చేసిన దళిత మహిళలు, పేదలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన స్వచ్ఛంధ సంస్థల్లోకి రాకముందు దూరదర్శన్ లో పని చేశారు.

జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ లో డీడీఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్ కల్, రాయికోడ్, మనూరు మండలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేద మహిళలకు అక్షరాస్య కల్పించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సంఘాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ తెలంగాణలో సంప్రదాయ పంటల పరిరక్షణ వంటి అంశాలపై ఉద్యమించారు. వ్యవసాయ భూముల్లో చిరు ధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాల సాగుకు కృషి చేశారు. ఝరాసంగం మండలంలోని మచునూరు గ్రామంలో పచ్చసాలే ఏర్పాటు చేసి చదువుతో పాటు కులవృతులపై శిక్షణ కలిపించారు. ప్రతి ఏడాది జనవరిలో పాత పంటల జాతర నిర్వహించి, వాటి సాగుపై అవగాహన కలిపించారు. చిరుధాన్యాల సాగుపై దేశ విదేశాల్లో నిర్వహించిన సదస్సుల్లో అవగాహన కల్పించారు. ఆయన అందించిన సేవలకు గాను ప్రజలు ఆయన్ను ముద్దుగా తెలంగాణ మిల్లెట్ మ్యాన్ అని పిలుచుకునే వారు.

సతీష్ మృతికి తెలంగాణ మంత్రి హారీష్ రావు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పీవీ సతీష్ ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.అలాగే పలువురు  ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త విని సంస్థ సిబ్బందితో పాటు జహీరాబాద్ ప్రజలు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. అలాగే పేద మహిళల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన డీడీఎస్ డైరెక్టర్ సతీష్ మృతి తీరని లోటు అని టీఎస్ఎంస్డీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ అన్నారు. సతీష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సతీష్ 1945 జూన్ 18న మైసూరులో జన్మించారు.  న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం జర్నలిస్టుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించి దూరదర్శన్‌కు దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా సేవలందించారు. ఆయన 1970 లలో (సైట్) చారిత్రాత్మక శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ప్రయోగంలో గణనీయమైన పాత్ర పోషించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh