తెలంగాణలో పెరుగుతున్న కరొన కేసులు ఎన్ని అంటే?

 Telangana corona case : తెలంగాణలో పెరుగుతున్న కరొన కేసులు ఎన్ని అంటే?

 కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా జీరోకు చేరిందని ఊపిరి పీల్చుకునేలోగా ఇప్పుడు మరోసారి ఈ  మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మూడు జిల్లాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలలో మాత్రం కరోనా వ్యాప్తి బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో గత రెండు వారాలు నుండి ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇంతకుముందు 0.5% గా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం వరకు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలలోనూ ప్రతి వంద మందిలో నలుగురైదుగురికి కరోనా పాజిటివ్ వస్తుందని, దీంతో ఆయా జిల్లాల ఆఫీసర్లు కరోనా కట్టడికి దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్లూఎంజా కేసులు వణికిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా కేసులు కూడా నమోదు అవుతుండడం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఈనెల మొదటి, రెండు వారాలలో కరోనా కేసులు బాగా పెరిగాయని, ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయని తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కరోనా మహమ్మారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే  మాస్క్, సోషల్ డిస్టెన్స్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే కరొన  వ్యాప్తిని నివారించవచ్చని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తుంది.

అలాగే తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాసింది. టెస్టింగ్, ట్రీటింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది.

‘కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా కేసులు హఠాత్తుగా పెరుగుతున్నాయనే సంకేతాలను ఈ సంఖ్యలు ఇస్తున్నాయి. కాబట్టి, స్థానికంగా కేసులు ప్రబలకుండా నివారణ, కట్టడి చర్యలు తీసుకోవాలి. కరోనా పై పోరులో మనం సాధించిన విజయాలు నిష్ఫలం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కేంద్రం తెలిపింది.

‘రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఏ ఏరియాల్లోనైనా కేసులు వేగంగా రిపోర్ట్ అవుతున్నాయంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మైక్రో లెవల్‌లో అంటే జిల్లా స్థాయిలో, సబ్ డిజిస్ట్రిక్‌ స్థాయిలో నియంత్రణ చర్యలను తీసుకోవాలి’ అని వివరించింది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh