టికెట్‌ లేకున్నా రైళ్లో ప్రయాణించవచ్చు కానీ ఇలా చేయండి

Indian Railways:టికెట్‌ లేకున్నా రైళ్లో ప్రయాణించవచ్చు కానీ ఇలా చేయండి

ఇండియన్ రైల్వేస్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులు స్టేషన్ లో టికెట్ తీసుకునే సమయంలో క్యూ లైన్ లో నిలబడే కష్టాలు ఉండకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. టికెట్ తీసుకునే క్రమంలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుండి ఎవరైనా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినా భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే ఈ క్రమంలో ఓ చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు రైల్వే అధికారులు. రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలని , ఆ తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి ప్రయాణికులు వెళ్లవలసిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అయితే ప్లాట్ ఫామ్ టికెట్ కొనాల్సిందే కదా అని ఆలోచిస్తున్న ప్రయాణికులకు క్యూలో నిలబడి కొనాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది.

ప్లాట్ ఫామ్ టికెట్ ను యు టి సి యాప్ ద్వారా లేదా రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న వెండింగ్ మిషన్ ద్వారా తీసుకోవచ్చని, దీంతో వివిధ కారణాలతో ఆలస్యంగా స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు రైలు సమయం దగ్గర పడుతోంది అని, క్యూలో నిల్చుని టికెట్లు కొనాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, డైరెక్టుగా రైలెక్కి రైల్లోనే టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.

అయితే అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వే యూటీఎస్(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) అనే మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని సాయంతో ఎలా టికెట్లు తీసుకోవాలో చూద్దాం. మనం ప్రయాణించేటప్పుడే కాకుండా నెలవారీ సీజన్ టికెట్లు కూడా తీసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ వాడేవారు గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ వాడేవారు యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌లు వాడేవారు విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మన ఫోన్ నెంబరుతోపాటు పేరు, పాస్ వర్డ్, పుట్టిన తేదీతోపాటు ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేస్తే చాలు.

  • రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ఫోన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో మన అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
  • టికెట్‌ బుకింగ్‌ కోసం ‘నార్మల్‌ బుకింగ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ట్రావెల్‌ (పేపర్‌లెస్‌), ప్రింటెడ్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ప్రింట్(పేపర్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • మనం ఎక్కడికి ప్రయాణించాలో ఆయా స్టేషన్ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రయాణికుల సంఖ్య, ఎక్స్ ప్రెస్ ట్రైనా? సూపర్ ఫాస్టా? రెండోక్లాసా? అన్ రిజర్వుడ్ లాంటి వివరాలు నమోదు చేయాలి.
  • ‘పేమెంట్‌ టైప్‌’లో ఆర్‌-వ్యాలెట్‌ లేదంటే ఆన్ లైన్ లో నగదు కట్టేందుకు ఉన్న ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. టికెట్ ఖర్చు ఎంతవుతుందో అంత ‘బుక్‌ టికెట్‌’పై క్లిక్‌ చేయాలి. దీంతో టికెట్‌ బుక్‌ అవుతుంది.
  • ‘షో టికెట్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే టికెట్‌ వివరాలు కనిపిస్తాయి. ‘వ్యూ టికెట్‌’పై క్లిక్‌ చేస్తే మనం బుక్ చేసుకున్న టికెట్‌ కనిపిస్తుంది.
  • ‘ప్లాట్‌ఫాం బుకింగ్‌’ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌, ‘సీజనల్‌ టికెట్స్‌’తో నెలవారీ టికెట్‌ తీసుకోవచ్చు. వాటిని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
  • ఆర్ వ్యాలెట్ ను ఉపయోగించాలనుకుంటే ముందుగా దాన్ని రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 లోపు రీఛార్జ్ సాధ్యపడదు. రూ.100, ఆపై మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.
  • జీపీఎస్‌ను యాక్టివేట్‌ చేయడంతోపాటు మనం ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ తీసుకోగలం. టికెట్‌ పొందిన గంటలోపు రైలెక్కాలి.
  • ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోగలం.
  • పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయడం కుదరదు. రైలు ఎక్కాల్సిన స్టేషన్ కు దగ్గర్లో ఉండి వీటిని పొందాల్సి ఉంటుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh