ఓటీటీ కంటెంట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనురాగ్ ఠాకూర్

OTT: ఓటీటీ కంటెంట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటీటీ కంటెంట్​పై అందులో ఉండే అశ్లీలతపై ఘాటుగా స్పందించారు. ఓటీటీల్లో వచ్చే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్​లు అసభ్యకరంగా ఉంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు  అయితే  ఓటీటీల పేరుతో ఇష్టం వచ్చినట్టు తీస్తే  వూరుకునేది లేదు అంటూ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చారు.

అలాగే ఆయన మాట్లాడుతూ ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని అంతేకాని అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని స్పష్టం చేశారు. ఓటీటీల్లో అశ్లీలత హద్దులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆయన  పేర్కోన్నారు.

కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా నాగ్‌పూర్‌లో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న అశ్లీలత, అసభ్య పదజాలం గురించి విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై ప్రభుత్వ తీవ్రతను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ” సృజనాత్మకత పేరుతో దుర్భాషలాడితే సహించేది లేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం ఎక్కవుతోంది అంటూ ఆయన మండిపడ్డారు.

దీనిలోని అసభ్యకరమైన కంటెంట్‌పై పెరుగుతున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనికి సంబంధించి నిబంధనలలో ఏవైనా మార్పులు చేయవలసి వస్తే దానిని పరిగణనలోకి తీసుకునేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు.  ఈ ప్లాట్‌ఫారమ్‌లలో సృజనాత్మకతకు స్వేచ్ఛ ఇవ్వబడింది తప్పా అశ్లీలతకు కాదు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు.

Anurag Thakur on Twitter: “क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती। ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। https://t.co/6pOL66s88L” / Twitter

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh