ఏపీ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు

AP Rains: ఏపీ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశువులు కాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది.  దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్..

దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఆవరించి ఉన్న ద్రోణి ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు  రాయలసీమ, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు(గంటకు 30-40కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

అయితే ఈ భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

పలు ప్రాంతాల్లో పిడుగులు పడి వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల సమీపంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో విపత్తుల శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల వేళ పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపురుల చెట్ల కింద ఉండరాదని సూచిస్తోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh