త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ

Made in India Electric flying taxi

హెలికాఫ్టర్ కంటే వేగంగా ప్రయాణికులను చేరవేసే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రోటోటైప్ ను ఐఐటీ మద్రాస్ స్ట్రాటప్ నమూనాను తయారు చేసింది.  ఈ స్టార్టప్ 2017లో ఏర్పాటై ఈ వారంలో బెంగళూర్ లో జరిగిన ఏరో ఇండియా షోలో ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రోటోటైప్ ను ప్రదర్శించింది. పట్టణ ప్రయాణాలను వేగవంతంగా మరియు ఇబ్బంది లేకుండా చేయడానికి ఈప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఇవిఓటిఎల్) మోడల్ మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు దీనిలో ప్రయాణం చేయవచ్చని తెలిపింది.

దీనిలో ఇద్దరు ప్రయాణం చేయవచ్చని, ఒక ప్రయాణికుడికి ఒక ప్రయాణానికి అయ్యే ఖర్చు, అదే దూరానికి క్యాబస్  సాధారణంగా వసూలు చేసే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.  ఇది హెలీకాప్టర్ కన్నా వేగంగా వెళ్తుందని, పట్టణ ప్రాంతంలో వీటి ద్వారా వేగంగా సులభంగా ప్రయాణం చేయవచ్చు అని  స్టార్టప్ పేర్కొంది. దీని పార్కింగ్ కు 25 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే సరిపోతుందని , దీని బరువు దాదాపు 200 కేజీల, దీనికి నాలుగు ఫ్లయింగ్ ఫ్యాన్స్ అమర్చినట్లు, ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు అని  దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్ల  457 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదని తెలిపారు.అయితే ఇందులో బ్యాటరీ స్వాపబుల్ కాదు.

అయితే కంపెనీ ఇంకా ఈ బ్యాటరీ గురించి ఇ ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన వీడియో చూసిన తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ ట్యాక్సీని నిర్మించాలనే ఆలోచన వచ్చిందని ఈ సందర్భంగా ఈప్లేన్ కంపెనీ సీఈఓ ప్రాంజల్ మెహతా, స్టార్టప్ సీటీవో ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపారు. ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై తీసిన వీడియో చూస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందని, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో విశాలమైన రెండు సీట్ల క్యాబిన్, బకెట్-టైప్ సీట్లు, క్విక్-రిలీజ్ ఫంక్షన్ తో మల్టీ పాయింట్ సీట్ హార్నెస్ లు మరియు పైలట్ కోసం యోక్-స్టైల్ సెంటర్ స్టిక్ లభిస్తాయని, వేహికల్ టెలిమెట్రీ మరియు నావిగేషన్ ఫంక్షన్ ను ప్రదర్శించడానికి వాహనం బహుళ టోగిల్ స్విచ్ లు మరియు స్క్రీన్ లను కలిగి ఉంటాయని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపారు.  కానీ కంపెనీ వీటిని ఎప్పటి కల్లా మార్కెట్‌లోకి తీసుకువస్తోందో స్పస్టత ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh