మీనా పై తమిళ నటుడు సంచలన కామెంట్స్

తెలుగు, తమిళం భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీనా అప్పట్లో సౌందర్య తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది.  మీనా చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టారు. అలాగే స్టార్ హీరోలు అందరి సరసన నటించి కేవలం తెలుగులోనే కాదు తమిళంలోనూ తన సత్తా చాటింది మీనా. అయితే అంతలా ఆమె దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోన్నారు ఈ క్రమంలోనే ఆమె చాలా భాషల్లో ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించారు.

తర్వాత తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్‌గా మారారు. అనంతరం సౌత్‌లోని అన్ని భాషల్లోనూ పరిచయమయ్యారు. ఇక, తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన మీనా ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే మీనా విద్యా సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఓ పాపకు జన్మనిచ్చారు. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలోనే మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్‌లో మరణించారు.  చాలా కాలంగా శ్యాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడిన ఆయన కరోనా బారిన పడడంతో ప్రాణాలు కోల్పోయారు.

భర్త విద్యాసాగర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే కెరీర్‌కు విరామం తీసుకున్న మీనా ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతోబిజీగా వుంటున్నారు.  ముఖ్యంగా తెలుగులో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాలో నటించారు. అలాగే ‘రౌడీ బేబీ’ అనే తమిళ చిత్రంతో పాటు మలయాళంలో ‘జనమ్మ డేవిడ్’ అనే సినిమాను చేశారు. ఇలా బిజీగా గడుపుతోన్నారు.

ఇంత చిన్న వయసులోనే మీనా తన భర్తను కోల్పోయింది. దీంతో తన బాధ వర్ణణాతీతం. చాలామంది సెలబ్రిటీలు తనను ఓదార్చారు కానీ తన భర్త లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. అయితే ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది కాబట్టి పిల్లల కోసం అయినా రెండో పెళ్లి చేసుకోవాలంటూ మీనాను తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారట. అయితే  కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆమె రెండో పెళ్లికి సిద్ధం అయిందని వార్తలు వచ్చాయి.

అయితే ఈ నేపథ్యంలో ఆమె ‘నేను విచారంలో ఉన్నాను. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా కుటుంబ గోప్యతకు భంగం కల్పించకూడదని కోరుతున్నా. అలాగే నా రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదు’ అని చెప్పారు.  ఒకవైపు సీనియర్ హీరోయిన్ మీనా తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని చెబుతున్నా దీనిపై వార్తలు మాత్రం అస్సలు ఆగడం లేదు. తరచూ ఎవరో ఒకరు ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్, నటుడు బయిల్వాన్ రంగనాథన్ మీనా మళ్లీ పెళ్లి చేసుబోతోందని కామెంట్ చేశారు.

క్రిటిక్, నటుడు బయిల్వాన్ రంగనాథన్ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఎంతో మంది నటీనటుల పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘మీనా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. కోలీవుడ్‌లో ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ హీరోతోనే ఆమె జతకట్టబోతుంది’ అని సంచలన కామెంట్ చేశారు

Leave a Reply