Pincode : ‘పిన్’ పరువు తీసే….

Pincode

Pincode : ‘పిన్’ పరువు తీసే….

 

Pincode : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరువును ఓ పిన్ కోడ్ గంగలో కలిపింది. అవును మీరు చదువుతున్నది నిజమే. వివరాలలోకి వెళితే. వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ సంస్థ దావోస్ వేదికగా జనవరి 16-20 మధ్య జరగనున్న తమ వార్షిక సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆహ్వానించినట్టు వార్తలు వెలువడ్డాయి.

సహజంగానే ఈ వార్త పై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇద్దామన్న హడావిడిలో ఓ ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వ అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇక్కడే వైయస్ ఆర్ ప్రభుత్వం తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టయ్యింది.

 

 

పోస్ట్ చేసిన ఆహ్వాన పత్రికంతా బాగానే వుంది కాని  ముఖ్యమంత్రి కార్యలయం వెలగపూడి అని అడ్రస్ చేస్తూ పిన్ కోడ్ మాత్రం (500022) హైదరాబాద్ అని పేర్కొనడమే ప్రభుత్వ పరువును గంగలో కలిపింది.

ప్రపంచ స్థాయి వాణిజ్య సంస్థ ప్రతి లెక్కను పక్కాగా చూసే యంత్రాంగం ఓ పిన్ కోడ్ ను తప్పుగా పంపుతారా అన్నది అర్ధం కాని లెక్క. మన లెక్క ఏదైనా రాజుకోవాల్సిన అగ్గి పిన్ కోడా పుణ్యమా అని బాగా రాజుకొని ప్రతిపక్షాలు కావాల్సినంత కంటెంట్ తో సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువును గంగపాలు చేస్తున్నారు.

ఇక్కడ ప్రతి ఒక్కరి సందేహం ఏమిటంటే నిజంగా ఆ ఆహ్వాన పత్రికను వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ పంపిందా లేక వీళ్ళే సృష్టించారా… ఏది ఏమైనప్పటికీ చిన్న పిన్ గుచ్చుకుంటే మన శరీరం అల్లాడిపోతుంది, అలాంటిది ఈ పిన్ కోడ్ చేసిన నొప్పి జగన్ ప్రభుత్వానికి పంటి కింది రాయే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh