కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభంచేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రి కేటిర్ గారు  విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ క్యాంపస్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. క్యాంపస్ లో తిరుగుతు  విద్యార్థులతో మాట్లాడి అక్కడ అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకునారు. మంత్రి కేటిర్ కూడా అలాగే రకాల అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని పరిశీలించారు.

ఈ క్యాంపస్ తో పాటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 పాఠశాలలనూ మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ గంభీరావుపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రులు చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను.అందిచడం చాల సంతోషంగా ఉంది.అని అలాగే   కేజీ టూ పీజీ వరకు ఒకే చోట అందిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే ఈ క్యాంపస్ లో మొత్తం 70 తరగతి గదులు ఉన్నాయి. 3,500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో చదువుకునేలా ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్‌ హబ్‌లు నిర్మించారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం, ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానం, ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కళాశాలకు అవసరం అయ్యేలా భవనాలు సిద్ధం చేశారు. డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్‌ హాల్‌ నిర్మించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తమ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు సూచించారు.

అలాగే మన ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నో మాయమాటలు చెప్పి, 2014లో అధికారంలోకి వచ్చి. కూడా మన తెలంగాణ కు ఏమి  నెరవేర్చలేదని మండ్డి పడ్డారు .అదనపు సెస్సులతో పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.అలాగే  పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఎందుకు అయన ఎందుకు  దేవుడవుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన అరిష్టమంటూ కొన్ని రోజుల కిందట ఈటల రాజేందర్‌ బాధ కలిగించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి:

Dimple Hayathi In Shankars Movie keerthi suresh