పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై రఘురామ కీలక వ్యాఖ్యలు..

RAGHURAMARAJU COMMENTS: జనసేనాని  ఢిల్లీ టూర్ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

నవంబర్, డిసెంబర్ మాసాలలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ముందస్తు ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. జగన్ చూసే ప్రజలు ఓటు వేశారని, తన ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంతవరకు కరెక్ట్ ప్రశ్నించారు.

అయినా రేపో మాపో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయే వాడిని అయినా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు . ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బయటకు చెప్పడానికి భయపడుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారని రఘురామ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతమై పొత్తులపై స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ తరహా చెత్త ఆర్డర్లు ఇవ్వడానికి శ్రీ లక్ష్మీ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్నారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి లాయర్లను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొన్నా పంతం నెగ్గించుకోలేక పోయామన్న అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

అలాగే సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని.. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అసలు 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్ కు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్. విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు.

పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని సూచిం

 

Leave a Reply