దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దాo :కేసీఆర్

 BRS:దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దాo :కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ తన జీవితమంతా పోరాటాలతోనే గడుస్తోందని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నానని  కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా తగ్గిపోయాయని, దేశమంతా ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్​సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రైతు సంఘాల నేతలు శరద్ జోషి, ప్రణీత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌ కండువా కప్పుకున్నాబీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేను 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశాను ఆనాటి పరిస్థితులు నాకు తెలుసు. కానీ ఏ సమస్యకూ భయపడలేదు. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉండేది. గత ప్రభుత్వాలు మా ప్రాంత రైతులను హింసించారు. రోజుకు ఐదారుగురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకునేవారు. ఆనాటి పరిస్థితులు చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగేవి.” అంటూ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగొస్తాయని, అందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలే నిదర్శనం అన్నారు కేసీఆర్.

దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామ‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో 14 మంది ప్రధానులు మారినా ప్రజ‌ల త‌ల‌రాత, రైతుల తలరాత మాత్రం మార‌లేదు అన్నారు. రైతుల పోరాటం న్యాయ‌బ‌ద్ధమైన‌ది. త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌దన్నారు. చిత్తశుద్ధితో ప‌ని చేస్తే గెలిచి తీరుతాం. తెలంగాణ‌లో తమ ప్రభుత్వం ఏం చేసిందో మీరంతా గమనించండి. కాళేశ్వరం ప్రాజెక్టును సంద‌ర్శించండి అని మహారాష్ట్ర రైతు సంఘాల నేత‌ల‌కు ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు.
గత ఎనిమిదేళ్లుగా రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవని తెలిపారు. ఢిల్లీలో రైతుల నిర్వహించిన ధర్నాలో 750 మంది రైతులు అమరులయ్యారని గుర్తు చేసిన కేసీఆర్ అయినప్పటికీ చెక్కుచెదరకుండా ఉద్యమం కొనసాగించారని అభినందించారు. అయితే రైతులకు ఇచ్చిన ఒక్క మాటను కూడా ప్రధాని మోదీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఆ సమయంలో పంజాబ్, యూపీ ఎన్నికలు లేకుంటే కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసేది కాదని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే రావాలని ఆకాంక్షిచారు. సీఎంగా ఉండి కూడా రైతుల కోసం ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. మహారాష్ట్ర రైతులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదేనని తెలిపారు. వాళ్లు తలచుకుంటే ఆ సమస్య సాధ్యమవుతుందని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఎంతటి సమస్యకైనా కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో 90 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. యాసంగి సాగులో తెలంగాణ టాప్‌లో నిలిచిందన్నారు. సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి సాధించడం లేదని కేసీఆర్ మరోసారి వివరించారు

Leave a Reply