తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు

Thirumala  THIRUPATHI: తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు

తిరుమల ఆదాయంలో మరో కొత్త రికార్డు నమోదైంది. టీటీడీ హుండీకి కాసుల వ‌ర్షం కురుస్తోంది. నిన్న (శుక్రవారం)తో ముగిసిన 2022-23 ఆర్దిక సంవత్సరం వార్షిక ఆదాయం 1,520.29 కోట్లుగా అధికారులు తేల్చారు. గత ఏడాది ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం రూ 100 కోట్ల పైగానే ఉంది. మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ. 120.29 కోట్లు లభించింది. నేటి నుంచి ప్రారంభమైన ఆర్దిక సంవత్సరానికి టీడీపీ పాలక మండలి రూ 4,411.68 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదింది. దేశంలో మరే దేవాలయానికి లేని విధంగా ఈ బడ్జెట్ తో కొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఏడాది కాలంగా తిరుమల హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కానుకల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. మార్చి నెలలో రూ 120.29 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను శ్రీవారికి సమర్పిస్తున్నారు. దీంతో ప్రతీ నెలా శ్రీవారి ఆదాయం పెరుగుతోంది. 2022 సంవత్సరంలో అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.
అత్యధికంగా గతేడాది ఆగస్టు నెలలో 140.34 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయంలో శ్రీవారి ఆలయం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్లు వస్తుందని అంచనాగా చూపించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.990 కోట్లు వస్తుందని ఈ సారి బడ్జెట్ లో అంచనా వేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh