టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజి కేసులో బండి సంజయ్‌ అరెస్ట్

BAMD SANJAI:టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజి కేసులో బండి సంజయ్‌ అరెస్ట్ విషయం  తెలుసుకోవడానికి వెళ్ళిన  దుబ్బాక ఎమ్మెల్యే అరెస్ట్

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లో సంజయ్ నివాసానికి అర్థరాత్రి వెళ్లిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.

బిజెపి శ్రేణుల ఆందోళనల మధ్య సంజయ్ ను పోలీస్ వాహనంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో సంజయ్ అరెస్ట్ గురించి తెలుసుకునేందుకు వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసేందుకు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రఘునందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మప్టీలో వున్న పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రఘునందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. చొక్కా పట్టుకుని లాగుతూ పోలీస్ వాహనంలో ఎక్కిస్తూ అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులతో రఘునందన్ వాగ్వాదానికి దిగారు.

అసలు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఓ ఎమ్మెల్యేను పట్టుకుని మెడ పట్టుకుని లాగి దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ పోలీసులపై మండిపడ్డారు.రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా మహిళా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు  మహిళా మోర్చా నాయకులతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తుండటంతో సంజయ్ ను వుంచిన గాజులరామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోలీసుల తీరును ఖండించారు. ఒక ఎంపీకి కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పుదోవ పట్టించడానికి బండిని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈటల రాజేందర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అటు బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ బండి అరెస్ట్‌ను ఖండించారు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసిన రఘునందన్ రావును శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

అలాగే మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష సహా పలువురు నేతలు, కార్యకర్తలను గాజుల రామారం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అరెస్ట్ చేసిన వారిని వివిధ స్టేషన్లకు తరలిస్తున్నారు.

ఇక బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భారీగా బిజెపి శ్రేణులు గాజుల రామారం చేరుకునే అవకాశాలున్నాయని అనుమానిస్తూ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.బొమ్మల రామారాం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికెడ్లు పెట్టి అష్ట దిగ్బంధనం చేసారు. నలువైపులా పోలీసులను భారీగా మోహరించి ఆర్టీసీ బస్సులు సహా ఏ ఒక్క వాహనాన్ని బొమ్మల రామారం వెళ్లనీయకుండా ఆపేస్తున్నారు. చివరకు గ్రామస్తుల వాహనాలను సైతం అడ్డుకుంటున్నారు.
 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh