కొణిదెల వారి కోడల కు అరుదైన గౌరవం

Upasana: కొణిదెల వారి కోడల కు అరుదైన గౌరవం

అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు  శోభన, అనిల్ కామినేనిల కూతురు అయిన ఉపాసన ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది. మహిళా వ్యాపారవేత్తగా తన మార్క్ చూపెడుతోంది. తాజాగా ఆమె ఓ అరుదైన గౌరవం  సాధించింది.

అలాగే రీసెంట్ గా RRR సినిమాతో రామ్ చరణ్ చరిత్ర సృష్టించగా తాజాగా కొణిదెల కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు అరుదైన ఘనత సాధించింది అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు.. శోభన, అనిల్ కామినేనిల కూతురు అయిన ఉపాసన ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది.

అలాగే మహిళా వ్యాపారవేత్తగా తన మార్క్ చూపెడుతోంది. మెగా కోడలుగా తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే వ్యాపారంలో కూడా దూసుకుపోతోంది ఉపాసన. మరోవైపు ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవుతూ సామాజిక స్పృహతో ముందడుగులేస్తోంది. కుటుంబ బాధ్యతలతో బిజినెస్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది. మెడికల్ ఫీల్డ్ లో తనదైన మార్గంలో సేవ చేస్తూ వస్తోంది ఉపాసన.

అయితే ఎన్నో మెడికల్ క్యాంపులు, వైద్య సేవలు చేయించమే గాక మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. ఈ క్రమంలోనే తాజాగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసన చోటు దక్కించుకోవడం విశేషం.

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో ఘనంగా వైభవంగా జరిగింది. అప్పటి నుంచి మెగా ఫ్యామీలీ కోడలిగా, మహిళా వ్యాపారవేత్తగా పలువురి మన్ననలు పొందుతూ సత్తా చాటుతోంది ఉపా రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గాన్ని ఆనందంతో ముంచెత్తుతోంది. బేబీ బంప్ తో ఉన్నప్పటికీ యాక్టివ్ గా అన్ని ఈవెంట్స్ లో పాల్గొంటోంది ఉపాసన. ఉపాసన యూట్యూబ్ ఛానల్ ఏకంగా లక్ష సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందిస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది. ఉపాసన కొణిదెల అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తోంది.

అలాగే తనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ విషయాన్ని అయినా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఉపాసన ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి ‘బీ పాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈ మేరకు ‘బిపాజిటివ్ విత్ ఉపాసన’ పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించి పలువురు సెలెబ్రిటీల చేత హెల్త్ టిప్స్ చెప్పిస్తూ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తోంది. దీంతో ఉపాసన ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానల్‌కి బాగా ఆదరణ పెరిగింది.

ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే.

Leave a Reply