ఏజెంట్ మూవీ పై అమల షాకింగ్ కామెంట్స్

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజైంది. ఓ మాదిరి అంచనాలతో బరిలో దిగినప్పటికీ రిలీజ్ తర్వాత ఊహించని రెస్పాన్స్ అందుకుంది. దాదాపు ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్నారు. నార్మల్ ఆడియెన్స్ చెప్పిన దానిగురించి పక్కనబెడితే అక్కినేని ఫ్యాన్స్ అయితే అఖిల్ విషయంలో చాలా బాధపడుతున్నారు. సినిమా చూసి తట్టుకోలేక తమ అసహనాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ తల్లి అమల సినిమా చూశారు. తన రియాక్షన్ చెప్పడంతో పాటు ‘ఏజెంట్’పై వస్తున్న ట్రోల్స్ కి కూడా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఏజెంట్తో కలిపి అఖిల్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ అవన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.   అయితే ఈ సినిమా మొదటి షో నుండి నెగిటీవ్ టాక్ ని సొంతం చేసుకొని ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు చేయడం మానేసి కొత్త కథలను చేయమని సలహాలు ఇస్తున్నారు.రిజల్ట్ పై తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే అఖిల్ కి అభిమానిగా ఉండటం కష్టమైపోతుందని పలువురు ట్వీట్స్ కూడా చేశారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై అఖిల్ తల్లి అమల అక్కినేని స్పందించారు.“దైర్యంగా మాట్లాడలేనివారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం అనవసరం. అఖిల్ కు కూడా అదే చెప్పాను. ఏజెంట్ సినిమా నేను చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రెమ్ లో కనిపిస్తుంది. నిజమే సినిమాలో కొన్ని లోపాలున్నాయి. నేను కాదు అనడం లేదు కానీ.. సినిమా చూస్తున్నంత సేపు అవేమి నాకు కనిపించలేదు. నేను ఈ సినిమాని థియేటర్ లో చూశాను. అక్కడ అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తున్నారు అని చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమల చేసిన ఈ కామెట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Leave a Reply