ఈ సారి పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా..? కొత్త సoవత్సరం జాతకం ఎలా ?

Pawan Future: ఈ సారి పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే  ఛాన్స్ ఉందా..? కొత్త సoవత్సరం జాతకం ఎలా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  ప్రస్తుతం పంచాంగం చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు అంటే ఉగాది అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది షడ్రుచుల పచ్చడే కాదు.. పంచాంగం కూడా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా తమ రాత ఈ ఏడాదైనా అంతా బాగుందా..? కష్టాలు.. నష్టాలు అన్ని పోతాయా అని పంచాంగం కోసం ఎదురు చూస్తుంటారు.

ముఖ్యంగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాల సంఖ్య చూసుకుంటూ ఉంటారు. అలాగే నామ సంవత్సరాది వేళ వచ్చే ఏడాదంతా ఎలా గడుస్తుంది ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి. సుభ కార్యాలు మొదలు పెట్టొచ్చా వ్యాపారాలు ప్రారంభించొచ్చా, సంపాదన పెరుగుతుందా, ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఇలా ఎన్నో లెక్కలు సరి చూసుకుంటూ ఉంటారు. సామాన్యులే కాదు రాజకీయ నాయకులు సైతం ఈ పంచాంగ శ్రవణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు.

సెలబ్రెటీలు , రాజకీయ నేతలు, ప్రముఖుల ప్రత్యేకంగా పండితులను పిలిపించుకుని పంచాంగం శ్రవణం చేయించుకుంటారు. ప్రస్తుతం అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం నడుస్తుండటంతో తదుపరి సీఎం పదవిని చేపట్టేది ఎవరు అన్న కూతూహలం ఉంటుంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి సీఎం పవన్ కావాలని జనసైనికలు ఆశిస్తున్నారు. పొత్తు ఉంటే పవర్ షేరింగ్ లో అయినా సీఎం కావాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరి పవన్ జాతకం ఈ ఏడాది ఎలా ఉండనుంది. పవన్ కళ్యాణ్ జాతకం గురించి ప్రముఖ జోతిష్య నిపుణులు ఏం చెప్పారని ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.మరి శోభకృత్ నామ సంవత్సరం వేళ, వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్  జాతకం ఎలా ఉంటుంది అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ టైమ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. ఈ తేదీ ప్రకారం ఆయనది సింహరాశి. సమీప భవిష్యత్తులో జనసేన  పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నాయని జ్యోతిస్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. ఒంటరిగా కానీ, పొత్తుగానైనా పోటీ చేసినా ఫలితాలు కలివస్తాయి అంటున్నారు. జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం ఆయన జనసేన ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో రాజయోగం ఉందని అన్నారు. ఆయనకు అమాత్యులయ్యే అవకాశాలున్నాయన్నారు. కొత్త మిత్రుడు ద్వారానైనా ఆయన పోటీ చేస్తారని పేర్కొన్నారు. శుక్రుడి ఫలితం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీతో సానిహిత్యం ఏర్పరుడుతుందని, ఆ మధ్య వర్తిత్వం వల్ల కూటమి సాధ్యమవుతుందని తెలిపారు.

 

Leave a Reply