రాజమౌళి నుంచి చాలా నేర్చుకున్నా – రామ్ చరణ్

Ram Charan Promotes RRR In The US

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన  ‘ఆర్ఆర్ఆర్’ ఎంత ఘనవిజయం సాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ కు ఎన్నో అవార్డులు రీవర్డ్ లు చలానే వచ్చేయి. కాగా ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల బరిలో ఈ మూవీని  నిలబెట్టడానికి ఆ మూవీ టీం మొత్తం చూస్తుంది. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు ‘ఆర్ఆర్ఆర్’ హీరో రామ్ చరణ్ మీడియాతో ముచ్చటిస్తూ తన అనుభవాలను పంచుకుంటున్నారు.  సినిమాకి భాష లేదని, భావోద్వేగాలే సినిమాను ఎలా తయారు చేస్తాయో ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి నుంచి నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అన్నారు.

ఆర్ఆర్ఆర్ (2022) స్వతంత్రానికి పూర్వం అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు స్వతంత్ర సమరయోధుల చుట్టూ తిరిగే తెలుగు భాషా యాక్షన్ డ్రామా గా ఈ చిత్రం తీయబడింది. దానికి ఒక్క బారతదేశం లోనే కాకుండా ప్రపంచం అంతా మంచి ఆదరణ, గుర్తింపు వచ్చింది. అలాగే ఆ మూవీ లో పాపులర్ పాట ఐన ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్స్ లో ఉత్తమ ఒరిజినల్ పాటగా అవార్డు గెలుచుకుంది. కాగా ఇప్పడు ఈ పాట ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. ఈ మూవీ తో మేము చాలా సాధించాము అని మేము అనుకున్నప్పుడు, భారతదేశంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించిన తరువాత, భారతదేశం మరియు తూర్పు దేశాలలో వచ్చిన ప్రతిస్పందనతో మేమందరం చాలా సంతృప్తి చెందాము అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడు కేటగిరీలో క్రిటిక్ ఛాయిస్ అవార్డుకు రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. కాగా మార్చి 16న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు రావాలని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కు ఆ అవార్డు రావాలని కోరుకుంటూ ప్రజ్ఞ మీడియా తరుపున అల్ ది బెస్ట్ రామ్ చరణ్.

ఇది కూడా చదవండి:

Leave a Reply