పవర్ స్టార్‌ ఫాన్స్ కు గుడ్ న్యూస్

pawan kalyan and sai dharam tej mega

పవర్ స్టార్‌ ఫాన్స్ కు గుడ్ న్యూస్

మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు బ్రేక్ పడింది. పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పవర్ స్టార్ సాయిధరమ్‌ తేజూ కలిసి నటిస్తున్న ఈ సినిమా వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తమిళంలో నిర్మించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్‌ వర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగులు అందిస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మామాఅల్లుళ్లు ఇద్దరూ బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాను శరవేగంగా కంప్లీట్‌ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలో పవన్‌ కళ్యాణ్‌ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన కమిట్‌ అయిన హరిహరవీరమల్లు సినిమా షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది. ఇది సెట్స్‌పై ఉండగానే సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ ది ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టార్‌ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌ కూడా రీసెంట్‌గా ప్రారంభమైంది. వీటితో పాటు హరీశ్‌ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా కూడా సెట్స్‌పైనే ఉంది. ఇది థేరీ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ఇలా వరుస సినిమాలు ఉండటంతో వినోదయ సిత్తం సినిమాకు కేవలం 20 రోజులు మాత్రమే పవన్‌ కళ్యాణ్‌ కేటాయించినట్లు టాక్‌. దీంతో మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply