తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా మనోజ్ దంపతులు

Manchu Manoj wife Bhuma Mounika visit Tirumala

  manchu manoj :తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా మనోజ్ దంపతులు

మోహన్ బాబు తనయుడు ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ఈ రోజు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వివాహ బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోదరి మంచు లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన నాలుగేళ్ల ప్రేమ ఫలించి భూమా మౌనికా రెడ్డితో వివాహం జరిగినందుకు హ్యాపీగా వుందని మంచు మనోజ్‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలకీ మధ్య స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణానంతరం వీరి బంధం మరింత బలపడింది. తరచూ మంచు మనోజ్‌ భూమా కుటుంబంలోని కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవారు. వీరి మధ్య బంధం బలమైనదన్న విషయం అనేక సందర్భాల్లో వ్యక్తం అయ్యింది.

మనోజ్ కు 12 ఏళ్ల నుంచి మౌనిక తనకు తెలుసని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను వేరే ట్రామాలో ఉన్నప్పుడు తనే అండగా నిలిచింది. అలా మరింత చేరువయినట్లు తెలిపారు ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని మనోజ్ పేర్కొన్నారు. మౌనికతో తన పెళ్లి దేవుడి ఆశీస్సులతోనే జరిగిందని బాబు తన జీవితంలోకి రావడం కూడా అలానే అన్నారు మనోజ్  కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడని పేర్కొన్నారు. ఇప్పుడు అది శాశ్వత బంధంగా మారింది.

ఐతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదన్నారు అయితే  ప్రజాసేవ చేయాలనే కోరిక మాత్రమే ఉందనీ, మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనకు  నా  సపోర్ట్ ఎప్పుడు  ఉంటుందన్నారు. ప్రజా సేవ చేయాలనే ఆలోచనే తమ ఇద్దరిని కలిపిందన్నారు మనోజ్ వాట్ ద ఫిష్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తానని మనోజ్ తెలిపాడు.

ఇది కూడా చదవండి :

Leave a Reply