మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Former miss Universe Sushmita Sen got heart attack

మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటుఆమె ఎవరో కాదు  అందాల భామ సుస్మితా సేన్ ఈ సుందరి మొదట  మోడలింగ్‌ను కెరీర్‌గా ఆరంభించి అనంతరం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న తర్వాత వెండితెర పైకి ఆమె రంగప్రవేశం చేశారు. తాజాగా ఆమె ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురయినట్టు చెప్పారు. యంజియో ప్లాస్టీ చేయించుకున్నట్టు కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకున్నారు.

‘‘మీ గుండెను పదిలంగా ఉంచండి. అది మీకు అవసరమైనప్పుడు అండగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నాకు గుండె పోటు వచ్చింది. యాంజియో ప్లాస్టీ కూడా చేయించుకున్నాను. స్టెంట్ కూడా వేశారు  నాకు పెద్ద గుండె ఉందని మా కార్డియాలిజిస్ట్ చెప్పారు. నాకు వైద్యం అందించిన అనేక మందికి నేను మరొక పోస్ట్‌లో ధన్యవాదాలు చెప్తాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నా శ్రేయస్సును కోరుకునేవారు. నన్ను ప్రేమించేవారికి ఈ విషయాన్ని తెలపాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాను. నేను మరికొంత జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని సుస్మితా సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుస్మిత గుండె పోటు బారిన పడిందని తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అనేక మంది పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ఓటీటీలోకి కొంత కాలం క్రితమే ఆమె ఎంట్రీ ఇచ్చారు. ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ షో ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తయింది. మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘ఆర్య 3’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి :

https://www.instagram.com/p/CpSF-IvtWG4/?utm_source=ig_web_button_share_sheet

 

 

 

Leave a Reply