పవన్ కళ్యాణ్ మూవీలో అలీ నటించబోతున్నాడా ?

Ali to star in Pawan Kalyan's movie Ali to star in Pawan Kalyan's movie

పవన్ కళ్యాణ్ మూవీలో అలీ నటించబోతున్నాడా ?

టాలీవుడ్ కమెడియన్ ఆలీ  గురించి తెలియని వారు లేరు అనడంలో అతీయోశక్తి లేదు.  అయితే ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మంచి స్నేహబంధం ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో అలీ ఖచ్చితంగా  ఒక పాత్ర పోషించాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు మాట కానీ  కొంతకాలంగా అలీ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో కనిపించడం లేదు. చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో మాత్రమే వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో కూడా అలీ నటించలేదు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ప్రస్తుతం మరో మూడు సినిమాలు నటిస్తున్నారు అయినా కూడా ఎక్కడ ఆలీ ఇందులో నటిస్తున్నట్లు సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ ను మరోసారి సెట్ చేయడానికి హరీష్ శంకర్ ప్రయత్నం చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆలీ ఒక కీలక పాత్రకి ఎంపికైనట్లు తాజా సమాచారం. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సినిమాలో అలీ నటించిన విషయం తెలిసిందే. అందులో పవన్ కళ్యాణ్, అలీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.ఇద్దరి మధ్య సన్నివేశాలు అభిమానులలో ఉత్సాహాన్ని నింపాయి ఈ నేపథ్యంలో మరోసారి ఆ కాంబినేషన్ తెరపై కనిపిస్తే సెంటిమెంటుగా సినిమాకి కలిసొస్తుందన్న ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నది అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే ఆలీ పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అనే చెప్పాలి. ఆలీ నటించాల్సిన అవసరం లేకపోవడం మరియు వీళ్ళ  ఇద్దరి మధ్య రాజకీయంగా తలెత్తిన చిన్నపాటి కారణాలవల్ల వీరిద్దరి కాంబో సెట్ అవ్వలేదని చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు వీరిద్దరిని హరీష్ శంకర్ కలపబోతారా లేదా అన్నది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి :

Leave a Reply