ఏపీలో నేటి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు

10th pre-final exams to be held in AP from today

Tenth class : ఏపీలో నేటి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు

పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు  నేటి (గురువారం) నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్షలు విద్యార్థుల స్థాయిని తెలుసుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ప్రీ ఫైనల్‌కు సంబంధించి తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ పరీక్షలు ఉదయం కాకుండా మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్‌ పరీక్షలకు ప్రింటెడ్‌ పేపర్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష పేపర్లు మండల కేంద్రాలకు చేరుకున్నాయి. పరీక్ష పత్రాలను ఏరోజుకారోజే విడుదల చేస్తారు.

ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ తొమ్మిదో తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) 100 మార్కులకు, కాంపొజిట్‌ కోర్సు విద్యార్థులకు 70 మార్కులకు నిర్వహిస్తారు. 10న సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ, 14న ఇంగ్లిషు, 15న గణితం, 16న సైన్స్‌, 17న సోషల్‌, 18న ఓఎస్‌ఎస్‌సీ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) పేపర్‌-1, 20న ఓఎస్‌ఎస్‌సీ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) పేపర్‌-2 నిర్వహించనున్నారు.

విద్యా శాఖ ఏటా నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ), రెండు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్‌ఏ పరీక్షల్లో చివరివైన ఎఫ్‌ఏ-4 పరీక్షలు 1 – 9వ తరగతుల విద్యార్థులకు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 14వ తేదీ వరకూ పాత విధానంలోనే జరగనున్నా యి. వీటికి పేపర్లను ఆన్‌లైన్‌లో ఆయా ప్రధానోపాధ్యాయులకు పంపించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎయిడెడ్‌ యాజమాన్యంలో 15,956, ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లో 4,71,958, ప్రైవేటు యాజమాన్యంలో 2,59, 838 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎస్‌ఏ-2 పరీక్షలను 1-8 తరగతులకు సీబీఏ విధానంలోను, తొమ్మి దో తరగతికి మాత్రం పాత విధానంలోను నిర్వహించనున్నారు. అలాగే పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే ప్రీ ఫైనల్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలి. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా నిర్వహించేలా కింది స్థాయి వరకూ ఆదేశాలు ఇచ్చాం.

ఇది కూడా చదవండి :

Leave a Reply