హోలీ మార్చి 7 లేదా 8 ఎప్పుడు జరుపుకోవాలి ?

When should Holi be celebrated on March 7 or 8?

Holi :హోలీ మార్చి 7 లేదా 8 ఎప్పుడు జరుపుకోవాలి ?

దేశవ్యాప్తంగా ఈ హోలీ పండగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలుసిద్దామవుతున్నారు . హోలికా పౌర్ణమి నాడు కామదహనంతో ఈ వేడకలు ఆరంభమౌతాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయంలో ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఒకే రోజున ఈ పండగ వేడుకల్లో పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హోలీ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయాల ప్రకారం- వేర్వేరు తేదీల్లో హోలీని జరుపుకొంటుంటారు. ఈ పండగలో అతి ప్రధానమైన కామదహన కార్యక్రమం ఏ రోజున నిర్వహిస్తారనే విషయంపై కొంత భిన్నవాదనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు రెండు రోజుల పాటు హోలిని జరుపుకొంటాయి. తొలి రోజు హోలికా దహన్, రెండో రోజు మహారాష్ట్రలో ధూళివందన్ అని పిలుస్తారు.

క్యాలెండర్ ప్రకారం- ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును హోలీకా పౌర్ణమిగా భావిస్తారు. హోలికా అనే అసురుడిని దహనం చేసిన రోజు కావడం వల్ల దానికి గుర్తుగా అదే రోజున ఈ పండగను జరుపుకుంటారు. హోలికా దహన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రాత్రి జరుగుతుంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో హోలికా దహన్ కార్యక్రమాన్ని ఛోటీ హోలీ, ధులండిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.దక్షిణాది రాష్ట్రల్లో కూడా రెండురోజుల పాటు హోలీ పండగ వేడుకలను నిర్వహిస్తారు. తన తపస్సును భగ్నం చేశాడనే కారణంతో త్రినేత్రంతో మన్మథుడిని భస్మం చేసిన రోజుకు గుర్తుగా దక్షిణాది రాష్ట్రాలవారు హోలీ పండగను జరుపుకొంటుంటారు. ఒక్కరోజు ఒక్కో సంప్రదాయంలో, ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా హోలీ పండగను జరుపుకోవడం వల్ల తేదీల్లో గందరగోళం నెలకొందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి ఈ సాయంత్రం(సోమవారం)  4:17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మంగళవారం సాయంత్రం 6:09 నిమిషాలకు ముగుస్తుంది. కాగా పౌర్ణమి తిథి రేపటితో ముగియనున్నందున ఆ రోజు సాయంత్రం నుంచి హోలికా దహన్ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ మరుసటి రోజు అంటే 8వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply