వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Viveka murder case Telangana HIGH Court issues order

Viveka Murder Case: వివేకా హత్య కేసులో  తెలంగాణ హైకోర్టు  కీలక ఆదేశాలు

వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను హార్డ్ డిస్క్ రూపంలో కోర్టుకు సమర్పించాలని సీబీఐని కోరింది. అంతకుముందు వివేకా హత్య కేసులో హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించే సమయంలో విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించలేదనే అభియోగాలున్నాయని హైకోర్టు పేర్కొంది. మొత్తం రికార్డులు, ఫైల్స్‌ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

సోమవారం నాటి ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని కోరింది. కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ చేపట్టింది. గతంలో రెండు సార్లు విచారణలో ఆడియో, వీడియో రికార్డులు చేశారా అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. ఏ 4గా ఉన్న దస్తగిరి బెయిల్‌పై సీబీఐ అభ్యంతరం తెలపలేదని హైకోర్టుకు అవినాష్‌ తరఫు న్యాయవాది తెలిపారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలంది.

అప్పటివరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ తరఫు న్యాయవాది కోరగా అసలు  అవినాష్‌రెడ్డి సాక్షా? లేక నిందితుడా? అని సీబీఐని ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని అవసరమైతే అవినాష్‌ను ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం అవసరమైతే ఆయన మంగళవారం మరోసారి కోర్టుకు హాజరవుతారని తెలిపింది.

ఇక ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ  ఈ రోజు ముగిసింది. ఆయనను మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ విచారించింది. అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండుసార్లు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగాను. వాళ్లు పట్టించుకోకపోతే హైకోర్టును ఆశ్రయించాను. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతోంది. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు’’ అని అన్నారు. అసలు సీబీఐ వాళ్లే మా సోదరికి సమాచారం ఇస్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

‘‘నా తరఫున వివేకా ఇంటింటికీ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. కట్టుకథను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉన్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేస్తా. విచారణ సమయంలో ఒక ల్యాప్‌టాప్‌ మాత్రమే పెడుతున్నారు. ల్యాప్‌టాప్‌లో రికార్డింగ్‌ చేస్తున్నారో లేదో కూడా  తెలియదు.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply