గవర్నర్ పై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Files petition against Governor in Supreme Court

గవర్నర్ పై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పై ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ను  ఆశ్రయించింది. గవర్నర్ పైన ప్రభుత్వం రిట్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించటం లేదని వాటిని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. ప్రభుత్వం నుంచి పది కీలక బిల్లులను పంపిన వివరాలను పిటీషన్ లో వివరించింది. కొద్ది కాలం క్రితం వరకూ ప్రభుత్వం గవర్నర్ మధ్య గ్యాప్ కనిపించినా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఆ గ్యాప్ సమిసిపోయినట్లు అందరూ భావించారు.

అయితే ఇప్పుడు ఆకస్మికంగా తెలంగాణ సీఎస్ ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసారు. కోర్టు నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది  ప్రభుత్వం పంపిన బిల్లులు సుదీర్ఘ కాలం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని వాటిని ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పది బిల్లులను అందులో ప్రస్తావించారు. గవర్నర్ ను ఆ పిటీషన్ లో ప్రతివాదిని చేశారు. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించని విషయాన్ని పిటీషన్ లో ప్రస్తావించారు. ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొన్న పది బిల్లుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు, ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, మున్సిపల్‌ చట్ట సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ బిల్లలు ఉన్నాయి.

వీటితో పాటుగా ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు, మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ  పంచాయతీరాజ్ చట్ట సవరణ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్లులు ఉన్నాయని సమాచారం. ఈ బిల్లులన్నీ గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందగా, వాటిని ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. కానీ, ఆమోదం లభించలేదు. కొంత కాలం క్రితం ఇదే అంశం పైన తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసం పైన రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది. ఇదే అంశం కోర్టులో ప్రస్తావనకు రాగా అటు రాజ్ భవన్ ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదుల జోక్యంతో ఆ కేసు వివాదం ముగిసింది.

ఇప్పుడు తిరిగి పెండింగ్ బిల్లుల అంశం పైన ప్రభుత్వం మరల  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన బిల్లు కూడా అందులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. రేపు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు గవర్నర్ పైన ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయటంతో ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుదో ఎటువంటి నిర్ణయం తిసుకుంటున్నదో  ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply