వీరోచితంగా, ధైర్యంగా పోరాడుతున్నా వారిని చూసి మేము గర్విస్తున్నాము – పుతిన్

putin says We are proud of the Russian soldiers

ఉక్రెయిన్ లో తన చారిత్రక భూముల కోసం పోరాడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ దాడికి మద్దతుగా మాస్కోలో నిర్వహించిన దేశభక్తి ర్యాలీలో మాట్లాడిన పుతిన్ ఈ విదంగా వ్యాఖ్యలు చేశారు. ఈ దేశభక్తి ర్యాలీ మాస్కోలోని ప్రధాన లుజ్నికి స్టేడియంలో జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది దేశ భక్తులు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా పుతిన్ ఉక్రెయిన్ లోని రష్యన్ సైనికులను ఉద్దేశించి   “వీరోచితంగా, ధైర్యంగా పోరాడుతున్నారు: మేము వారిని చూసి గర్విస్తున్నాము” అని ప్రశంసించారు. ప్రస్తుతం మన చారిత్రక భూముల కోసం, మన ప్రజల కోసం యుద్ధం జరుగుతోందని దేశ అత్యున్నత సైనిక నాయకత్వం నుంచి విన్నాను’ అని పుతిన్ పేర్కొన్నారు.

కాగా ఈ రష్యన్ పబ్లిక్ హాలిడే సందర్భంగా మరియు ఉక్రెయిన్ దాడి వార్షికోత్సవానికి రెండు రోజుల ముందు జరిగిన “గ్లోరీ టు ది డిఫెండర్స్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్” కచేరీకి -15 డిగ్రీల సెల్సియస్ (5 డిగ్రీల ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలలో  ప్రేక్షకులు రష్యన్ జెండాలు ఊపుతూ దేశభక్తి ప్రదర్శనలు, ప్రసంగాలను వీక్షించారు.  రాక్ స్టార్ గ్రిగోరీ లెప్స్ రష్యా గౌరవార్థం ఒక పాటతో ప్రదర్శనను ప్రారంభించగ, దక్షిణ నగరమైన వోల్గోగ్రాడ్ లోని “ది మదర్ ల్యాండ్ కాల్స్” విగ్రహం చిత్రాలను స్టేడియం చుట్టూ ఉన్న స్క్రీన్లపై ప్రదర్శించారు.  రష్యా స్వాధీనం చేసుకోవడానికి ముందు సుదీర్ఘ ముట్టడితో నాశనమైన ఓడరేవు నగరం మారిపోల్ తో సహా ఉక్రేనియన్ డాన్బాస్ నుండి నిర్వాహకులు పిల్లలను వేదికపైకి తీసుకువచ్చారు. ఉక్రెయిన్ తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుండి వేలాది మంది ఉక్రేనియన్ పిల్లలను రష్యా అపహరించుకుపోయిందని ఆరోపించింది, దీనిని మాస్కో ఖండించింది, చట్టబద్ధమైన దత్తతలను నిర్వహించిందని పేర్కొంది. ఈ సభలో మాస్కో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకునే ఉక్రెయిన్ ప్రాంతాలకు చెందిన అధికారులు కూడా స్టేడియంలో ఉండి రష్యా ప్రభుత్వ మీడియాతో మాట్లాడటం విశేషం.

ఇది కూడా చదవండి:

Leave a Reply