కొన్ని MMTS రైలు స‌ర్వీసులు ర‌ద్దు – రైల్వే శాఖ

MMTS trains cancelled in Hyderabad

హైదరాబాద్ లో కొన్ని MMTS రైలు స‌ర్వీసులు మూడు రోజుల పాటు  ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది రైల్వే శాఖ.  నిర్వహణ కారణాల వల్ల వ‌చ్చే వారం సోమ, మంగళ, బుధవారాలు (13, 14, 15 తేదీల్లో) పలు MMTS సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు రైల్వే  అధికారులు శనివారం తెలిపారు. హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్, లింగంపల్లి – ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – లింగంపల్లి, ఫలక్‌నుమా – హైదరాబాద్, హైదరాబాద్– ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – రామచంద్రాపురం, రామచంద్రపురం – ఫలక్‌నుమా మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ఈ మార్గాలలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యమన్య మార్గాల్లో వారి ప్రయాణాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేసింది రైల్వేశాఖ.  ట్రాక్ నిర్వహణ మరియు ట్రాక్ తనికీలు, మరమత్తులు వలన ఈ అంతరాయం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: 

Leave a Reply